యూట్యూబ్ లో కంటెంట్ క్రియేటర్ల కోసం కొత్త పాలసీ..డీప్ ఫేక్ వీడియోలకు చెక్..!
TeluguStop.com
ప్రస్తుతం సోషల్ మీడియా వెబ్సై( Social Media Website )ట్ లలో డీప్ ఫేక్ వీడియోలు, AI- క్రియేటెడ్ వీడియోలు, ఆడియోలు తెగ హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
దీంతో ఇవి నిజమైన వీడియోల లేదంటే ఏఐ జనరేటర్ వీడియోల అని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు.
దీనివల్ల భారీగా నష్టం ఉంటుందని యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ల కోసం ఓ కొత్త పాలసీను అప్డేట్ చేసింది.
ఈ కొత్త పాలసీతో డీప్ ఫేక్ వీడియోలకు చెక్ పెట్టినట్టే.ఇకపై యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు అప్డేట్ చేసే ప్రతి వీడియోకు ఆ విషయాన్ని తప్పకుండా తెలియజేయాలి.
ఫలానా వీడియోను జనరేట్ చేశామని స్పష్టం చేయాలి.ఒక వీడియోను అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియో ఏఐతో జనరేట్ చేశారా లేదంటే మాడిఫైతో చేశారా అనేది తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది.
ఇలా చేస్తే ఆ వీడియో చూసే వ్యూయర్స్ కు క్రియేట్ చేసిందా లేదా అనేది సులభంగా తెలుస్తుంది.
"""/" /
పబ్లిక్ ఫిగర్స్, హెల్త్, ఎలక్షన్ లాంటి సున్నితమైన అంశాలను కవర్ చేసే ఏ ఐ క్రియేటెడ్ కంటెంట్ పై యూట్యూబ్ మరింత శ్రద్ధ చూపనుంది.
ఇలాంటి వీడియోలను పూర్తిస్థాయిలో పరిశీలించి, ప్రజా ప్రయోజనాలను ప్రభావితం చేసే ఈ కంటెంట్ పట్ల యూట్యూబ్ పూర్తిస్థాయిలో బాధ్యత వహిస్తుంది.
"""/" /
యూట్యూబ్ వీడియోలో ఉన్న వ్యక్తి ప్రయోజనం ఐడెంటిటీ పబ్లిక్ స్టేటస్( Identity Public Status ) వంటి వివిధ అంశాలను స్పష్టంగా పరిశీలిస్తుంది.
యూట్యూబ్ కంప్లైంట్స్ కోసం చెక్ చేయడానికి హ్యూమన్ ఆటోమేటెడ్ సిస్టంలను ఉపయోగిస్తుంది.యూట్యూబ్ కు సంబంధించిన ఈ కొత్త పాలసీలను ఉల్లంఘిస్తే క్రియేటర్ల యూట్యూబ్ వీడియోలను తీసివేయడం లేదా ఖాతాలు రద్దు చేయడం వంటి చర్యలను యూట్యూబ్ తీసుకుంటుంది.
యూట్యూబ్ ఏఐ క్రియేటివిటీ ( AI Creativity )సామర్థ్యానికి మద్దతు ఇస్తుంది కానీ వాటి వల్ల జరిగే ప్రమాదాల పట్ల కూడా జాగ్రత్త వహిస్తుంది.
ముఖ్యంగా డీప్ ఫేక్ వీడియోలకు చెక్ పెట్టడమే యూట్యూబ్ లక్ష్యం.