చరణ్ డాషింగ్ పిక్స్ షేర్ చేసిన ఉపాసన.. చూపులతోనే ఫైర్ చేస్తున్నాడుగా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా పరిచయం అవసరం లేని పేరు.

ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తో రామ్ చరణ్ అంతటా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ సినిమా తర్వాత ఈయన ఫాలోయింగ్ అమాంతం పెరిగింది అనే చెప్పాలి.ప్రజెంట్ రామ్ చరణ్ భారీ లైనప్ ను సెట్ చేసుకుంటూ మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ రెడీ చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ అతి త్వరలో జరగనున్న ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల వేడుక కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే.

అంతకంటే ముందుగా ఈయన నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ స్పెషల్ షో స్క్రీనింగ్ కు ఈ రోజు ప్లాన్ చేయగా ఈ క్రమంలోనే చరణ్ పలు ఇంటర్నేషనల్ మీడియా ఛానెల్స్ తో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ప్రతినిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.

"""/" / తాజాగా మరో ప్రముఖ షోలో చరణ్ పాల్గొనగా ఆ షోకు వెళ్లిన లుక్ నెట్టింట ఆసక్తిగా మారింది.

మరి ఈ లుక్ ను ఈయన భార్య ఉపాసన కూడా నెట్టింట షేర్ చేసింది.

ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.ఈ లుక్ ను షేర్ చేస్తూ చరణ్ ను ఫైర్ తో పోల్చిన తీరు మెగా ఫ్యాన్స్ ను మరింత ఆకట్టు కుంటుంది.

చరణ్ సూపర్ డాషింగ్ లుక్ తన డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్, గడ్డం అన్ని కలిసి అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్నాయి.

"""/" / మార్చి 12న జరిగే ఆస్కార్ ఈవెంట్ లో ఆర్ ఆర్ ఆర్ టీమ్ పాల్గొన బోతుంది.

మరి ఈసారి మన నాటు నాటు సాంగ్ అయినా ఆస్కార్ అవార్డు అందుకుంటుందో లేదో చూడాలి.

ఇదిలా ఉండగా ప్రెజెంట్ శంకర్ దర్శకత్వంలో చరణ్ ఆర్సీ15 చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.