అద్దె భవనాల్లోనే నూతన పంచాయితీలు

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలంలోని కమ్మగూడెం, కొట్టాల,వెంకేపల్లి,రాజపేట తండాలను గత ప్రభుత్వం నూతన పంచాయతీలుగా ఏర్పాటు చేసింది.

నూతన గ్రామపంచాయతీల్లో మౌలిక వసతులు కల్పించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కొత్త గ్రామపంచాయతీ అయిన రాజపేటతండాలో 140 కుటుంబాలు,687 మంది ఓటర్లు,1000 కి పైగా జనాభా ఉన్నా,ఎలాంటి మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు.

గ్రామంలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని పలుమార్లు ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని,పాత గ్రామపంచాయతీ వట్టిపల్లి నుంచి రాజపేట తండాకు సుమారు 2 నుండి 3 కి.

మీ.ఉంటుందని,ప్రతి నెల వట్టిపల్లి నడిచి వెళ్లి రేషన్ బియ్యం తెచ్చుకోవాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా సమయంలో స్థానిక గ్రామపంచాయతీ భవనంలోనే రేషన్ సరుకులు అందించారని,అదేవిధంగా అందిస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

రాజపేటతండా గ్రామపంచాయతీ సొంత భవనం నిర్మించలేదని, గతంలో ప్రతినెలా రూ.2 వేలు అద్దె చెల్లించేవారని,ఇప్పుడు రూ.

2500 అద్దె చెల్లిస్తున్నారు.గతంలో రాజంపేటతండాలోని ఒక వెంచర్ లో గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారని,కానీ,ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదన్నారు.

గ్రామానికి సంబంధించిన స్మశాన వాటిక నిర్మాణం కూడా సంపూర్తిగానే ఉందని,గ్రామానికి దూరంగా ఉండటంతో పనులను నిలిపివేశారని అంటున్నారు.

ఆయా గ్రామాల ప్రజలు సొంత గ్రామపంచాయతీ భవనం ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కృషి చేయాలని కోరుతున్నారు.

కృష్ణయ్య రాజీనామా ఎందుకు చేశారు ? వీటికి సమాధానం ఏది?