ఈ మ్యూజిక్ డైరక్టర్ల రాక తో అవకాశాలు కోల్పోయిన వాళ్ళు వీళ్లే…
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది అప్పటి దాకా చాలా సినిమాలు చేస్తూ మంచి బిజీ గా ఉంటారు.
కానీ కొంత మంది కొత్త వాళ్ల రాక తో సీనియర్లు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అవ్వాల్సి వస్తుంది.
నిజానికి వీళ్ళందరికీ కూడా మంచి టాలెంట్ ఉన్న ఆ సడన్ పాయింట్ లో వాళ్ళకి సక్సెస్ లేకపోవడం వల్ల వాళ్ళని పక్కన పెట్టేస్తారు సినిమా మేకర్స్.
సరిగ్గా ఒక పదిహేను సంవత్సరాల క్రితం తెలుగు లో ఇలానే అయింది మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ ( Taman )ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు.
ఇక ఆయన టాప్ లోకి వెళ్లిపోవడం ఆయన చేసిన సినిమాలు వరుసగా సక్సెస్ లు అందుకోవడం తో అప్పటి దాకా టాప్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అయిన మణిశర్మ( Mani Sharma ) ఆఫర్స్ మొత్తం తమన్ కి వెళ్లిపోయాయి.
ఇక దాంతో మళ్ళీ ఒక రెండు సంవత్సరాల పాటు మణిశర్మ కి అసలు ఒక్క పెద్ద సినిమా కూడా రాలేదు అంటే నిజంగా ఆశ్చర్యాన్ని కల్గించే విషయం అనే చెప్పాలి.
"""/" /
ఇలా తన శిష్యుడు అయిన తమన్ వల్లనే మణిశర్మ కి ఆఫర్స్ లేకుండా పోయాయి అనేది అప్పట్లో చాలా పెద్ద చర్చ గా నడిచింది.
ఇక కాల క్రమేణా మళ్ళీ మణిశర్మ కొన్ని చిన్న సినిమాలతో ప్రూవ్ చేసుకొని మళ్ళీ పెద్ద సినిమాలు చేస్తున్నాడు.
ఇక ఇలానే తమిళం లో కూడా అనిరుధ్ ( Anirudh )ఎంట్రీ తో అప్పటి వరకు టాప్ లో ఉన్న హరీష్ జయరాజ్ ( Harish Jayaraj )కి కూడా అవకాశాలు తగ్గిపోయాయి.
ప్రస్తుతం తమిళంలో ఏ పెద్ద సినిమా తీసుకున్న అందులో మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ఉంటున్నాడు ఒకప్పుడు ఇలానే హరీష్ జయరాజ్ కూడా చాలా బిజీగా ఉండేవాడు కానీ అనిరుధ్ రాక తో హరీష్ జయరాజ్ కి అవకాశాలు తగ్గిపోయాయి.
మెగాస్టార్ బాబీ కాంబో సినిమాకు నిర్మాత ఎవరు.. చిరంజీవి అలా చేయడం సాధ్యమేనా?