'దసరా' మరో కొత్త పోస్టర్.. అంచనాలు పెంచేస్తున్న నాని!

న్యాచురల్ స్టార్ నాని నుండి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటారు.

ఎందుకంటే ఈయన మొదటి నుండి విభిన్న కథలతో విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టు కుంటూ వచ్చాడు.

అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగి తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సంపాదించు కున్నాడు.

ఇక నాని చేతిలో ప్రెజెంట్ క్రేజీ సినిమాలు ఉన్నాయి.అందులో ముందుగా రాబోయే సినిమా 'దసరా'.

శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈయనకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.

నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సాలిడ్ మాస్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుంది.

గోదావరి ఖని లోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ రూపొందిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో నాని ధరణి అనే తెలంగాణ యువకుడి పాత్రలో పక్కా మాస్ పాత్రలో చేస్తున్నాడు.

ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా నుండి తాజాగా మరొక పోస్టర్ రిలీజ్ చేసారు.

రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉన్న అప్పుడే ప్రొమోషన్స్ చేస్తూ ఈ సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నారు.

ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో నాని మాసిన బట్టల్లో.చెరిగిన గడ్డం.

లుంగీ పైకి కట్టి.చిరునవ్వుతో కనిపిస్తున్న నాని మాసివ్ లుక్ ప్రతీ ఒక్కరిని ఆకట్టు కుంటుంది.

"""/"/ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రేపు అక్టోబర్ 3వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

ధూమ్ ధామ్ దోస్తానా అంటూ సాగే ఈ ఫస్ట్ సింగిల్ ఎలా ఆకట్టు కుంటుందో చూడాలి.

ఇక ఈ సినిమా 2023 మార్చి 30న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేసారు.

ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవారు కచ్చితంగా తినాల్సిన పండ్లు ఇవే!