యూట్యూబ్ లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ కంటెంట్‌ను ఈజీగా కనిపెట్టొచ్చు...!

యూట్యూబ్ లో కొత్త ఫీచర్ ఇకపై ఆ కంటెంట్‌ను ఈజీగా కనిపెట్టొచ్చు…!

యూజర్లను ఆకట్టుకునేందుకు యూట్యూబ్ వీడియోల క్రియేటర్లు చాలా ట్రిక్స్ ప్లే చేస్తుంటారు.నిజానికి వీరి ట్రిక్స్ వల్ల యూట్యూబ్ యూజర్లు బాగా మోసపోతుంటారు.

యూట్యూబ్ లో కొత్త ఫీచర్ ఇకపై ఆ కంటెంట్‌ను ఈజీగా కనిపెట్టొచ్చు…!

ముఖ్యంగా క్రియేటర్లు తమ వీడియోలకు చాలా అట్రాక్టివ్ థంబ్‌నెయిల్స్ అప్‌లోడ్ చేస్తుంటారు.ఈ థంబ్‌నెయిల్స్‌కీ, లోపల ఉన్న వీడియో కంటెంట్‌కు ఏమాత్రం సంబంధం ఉండదు.

యూట్యూబ్ లో కొత్త ఫీచర్ ఇకపై ఆ కంటెంట్‌ను ఈజీగా కనిపెట్టొచ్చు…!

థంబ్‌నెయిల్స్‌కు సంబంధించిన సమాచారం ఉన్నా అది వీడియోలో ఒక చిన్న పార్ట్‌గా మాత్రమే ఉంటుంది.

ఈ పార్ట్ కోసం యూజర్లు వీడియో మొత్తం చూడాల్సి వస్తోంది.దీనివల్ల యూజర్లు డేటాతో పాటు చాలా సమయాన్ని అనవసరంగా కోల్పోతున్నారు.

అయితే ఈ సమస్యను గుర్తించిన యూట్యూబ్ ఒక సరికొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యింది.

'మోస్ట్‌ రీప్లేడ్' పేరిట ఈ ఫీచర్‌ను యూట్యూబ్ పరిచయం చేయనుంది.దీనివల్ల ఒక వీడియోలో ఏ భాగాన్ని యూజర్లు ఎక్కువసార్లు వీక్షించారనేది అందరికీ తెలుస్తుంది.

దాంతో యూజర్లు అవసరమైన పార్ట్‌ కోసం మొత్తం వీడియోని చూడాల్సినక్కర్లేదు.యూజర్లు మోస్ట్‌ రీప్లేడ్‌ను మాత్రమే చూడవచ్చు.

దాంతో యూజర్లకు చాలా సమయంతో సహా డేటా కూడా సేవ్ అవుతుంది. """/"/ నిజానికి మోస్ట్‌ రీప్లేడ్ ఫీచర్‌ యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు కొద్ది నెలల క్రితమే అందుబాటులోకి వచ్చింది.

అయితే ఇప్పుడు ఈ ఫీచర్‌ను డెస్క్‌టాప్‌, మొబైల్‌ రెగ్యులర్ యూజర్లకు యూట్యూబ్ తీసుకురానుంది.

ఈ ఫీచర్ తో యూజర్లు ఒక వీడియోలోని మోస్ట్‌ రీప్లేడ్ పార్ట్ ఈజీగా గుర్తించొచ్చు.

వీడియో ప్రొగ్రెసివ్‌ బార్‌ గ్రాఫ్‌ లో ఎక్కువసార్లు చూసిన వీడియో టైమ్ స్టాంప్ వద్ద గ్రాఫ్ కాస్త పెద్దదిగా కనిపిస్తుంది.

ఇలా సులువుగా వీడియోలో మోస్ట్ రీప్లేడ్ కంటెంట్‌ను గుర్తించి డేటా తో పాటు సమయం ఆదా చేసుకోవచ్చు.