ట్విట్టర్ ఖాతాలో బ్లాక్ చేయకుండానే ఫాలోవర్స్ ను తొలగించే కొత్త సదుపాయం..!

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్ల మెప్పు పొందుతోంది.

అయితే ప్రైవసీ విషయంలో మాత్రం ట్విట్టర్ అన్ని సోషల్ మీడియా యాప్స్ కంటే వెనకబడి ఉందనే చెప్పాలి.

ముఖ్యంగా ఇష్టం లేని వ్యక్తులు మన ట్వీట్లు చూడకుండా ప్రొటెక్ట్ చేసేందుకు ప్రవేట్, బ్లాక్ ఆప్షన్స్ తప్ప ఎలాంటి సదుపాయం అందుబాటులో లేదు.

కానీ చాలా మంది బ్లాక్ చేసేందుకు ఇష్టపడరు.అందుకే అలాంటి వారి కోసం ట్విట్టర్ తాజాగా "సాఫ్ట్ బ్లాక్" అనే సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది.

ఈ ఫీచర్ తో మిమ్మల్ని ఫాలో చేసిన వ్యక్తులు మీ ట్వీట్స్ ఎంతవరకు చూడగలరో నియంత్రించవచ్చు.

మిమ్మల్ని ఒక అజ్ఞాత వ్యక్తి ఫాలో చేసినప్పుడు.మీరు ఆ వ్యక్తిని సాఫ్ట్ బ్లాక్ చేస్తే.

వారు మీరు చేసే ట్వీట్స్ ను తమ ఫీడ్ లో చూడలేరు.మీ ట్వీట్స్ ను మీకు నచ్చని వ్యక్తుల టైం లైన్ లో కనిపించకుండా నియంత్రించేందుకు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.

ట్రోలింగ్ చేసే వ్యక్తులను కట్టడి చేసేందుకు కూడా ఈ ఫీచర్ ఉపయుక్తంగా ఉంటుంది.

అయితే వారు మళ్ళీ మిమ్మల్ని ఫాలో చేయగలరు.ఒకవేళ మిమ్మల్ని వారు రీఫాలో చేసినట్లయితే.

వారిని శాశ్వతంగా బ్లాక్ చేయొచ్చు లేదా ప్రైవేట్ అకౌంట్ గా మార్చుకోవచ్చు. """/"/ ఈ ఫీచర్ ఇలా యాక్టివేట్ చేసుకోండి 1.

మొదటగా డెస్క్‌టాప్ వెర్షన్ లేదా మొబైల్ యాప్‌ ద్వారా ట్విట్టర్ అకౌంట్‌లో లాగిన్ కావాలి.

2.ప్రొఫైల్‌ సెక్షన్‌పై క్లిక్ చేసి ఫాలోవర్స్‌ లిస్టును ఓపెన్‌ చేయాలి.

3.టాప్ టెన్ బ్లాక్ చేయదలుచుకున్న మీ ఫాలోవర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.

పేరు పక్కన ఉండే 'త్రీ డాట్‌ మెనూ'పై క్లిక్ చేయాలి.4.

'రిమూవ్‌ ద ఫాలోవర్‌' ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి 5.ఒకసారి ఇలా చేస్తే సదరు ఫాలోవర్‌ మీ ఫాలోవర్స్ లిస్ట్ నుంచి డిలీట్ అయిపోతాడు.

అప్పటికీ సదరు ఫాలోవర్ మీ ప్రొఫైల్‌, ట్వీట్స్‌ను చూడగలుగుతారు.అది కూడా మీకు ఇష్టం లేకపోతే ఆ ఫాలోవర్‌ను బ్లాక్‌ చేస్తే సరిపోతుంది.

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిపై వీడని ఉత్కంఠ..!