రూ.25వేలలో కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్.. దాని ఫీచర్లు తెలిస్తే..
TeluguStop.com
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఉడ్‌ఛలో ( UdChalo ) ఎప్పటికప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ బైక్స్ పరిచయం చేస్తూ ఆకట్టుకుంటుంది.
తాజాగా ఈ కంపెనీ వీర్ బైక్ పేరుతో మరో సరికొత్త ఎలక్ట్రిక్ సైకిల్ పరిచయం చేసింది.
దీని ధర చాలా అందుబాటు ధరలో ఉండటం విశేషం.అంతేకాదు, ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.
మరి అవేవో ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
సరికొత్తగా భారతదేశంలోని అందరికీ లాంచ్ అయిన వీర్ బైక్ ( Vir Bike )ధరను రూ.
25,995గా కంపెనీ నిర్ణయించింది.ఈ ప్రైస్ ఓన్లీ ఆర్మీ సిబ్బందికే వర్తిస్తుంది.
ఇక సాధారణ కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ సైకిల్ సొంతం చేసుకోవాలంటే రూ.27,995 చెల్లించక తప్పదు.
అంటే ఆర్మీ సిబ్బంది కంటే ఇతరులు రూ.2000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ రేటు కూడా అందుబాటు ధరలోనే ఉందని చెప్పవచ్చు.సాధారణంగా ఈ రోజుల్లో ఒక పెద్ద సైకిల్ కొనాలంటే రూ.
10,000 వరకు చెల్లించాల్సి వస్తోంది.అదే ఇంకొక రూ.
20,000 పెట్టుకుంటే శ్రమలేకుండా ఏంటంటే అటు వెళ్లగల ఈ అదిరిపోయే సైకిల్ సొంతమవుతుంది.
"""/" /
ఈ బైక్ ఫ్రేమ్ సాధారణ సైకిల్ లాగానే చాలా దృఢంగా ఉంటుంది.
అంతేకాదు ఈ సైకిల్ లో వెదర్ ప్రూఫ్, ఐపీ 67, ఐపీ 68 రేటింగ్, డీటాచబుల్ బ్యాటరీ ఫెసిలిటీ వంటి ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి.
దీనిని కొన్నవారు పాన్ ఇండియా లాజిస్టిక్ అండ్ సర్వీస్ ఉచితంగా పొందవచ్చు.దీని టాప్ స్పీడ్ 25 కిలోమీటర్లు మాత్రమే కాబట్టి నడిపేవారు ప్రత్యేకంగా లైసెన్స్ తీసుకోవాల్సిన పనిలేదు.
ఈ సైకిల్ 36V 7.5V బ్యాటరీతో సింగిల్ ఛార్జ్‌పై 40 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తుంది.
36 వీ 2ఏ బ్యాటరీ ఛార్జర్‌తో మూడు గంటల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది.
దీనిలో పవర్ కోసం 250 వాట్ పవర్ మోటార్‌ను ఆఫర్ చేశారు.పెడల్ అసిస్ట్ సెన్సార్, 3 రైడింగ్ మోడ్స్, 120 కేజీల వరకు లోడ్‌ను లాగగల సామర్థ్యం వంటివి ఇందులో ఉన్నాయి.
ఛార్జింగ్ ( Charging )అయిపోతుందని భయం వాహనదారులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.ఎందుకంటే దీనిని సాధారణ సైకిల్ వలే తొక్కుకుంటూ ఇంటికి వెళ్లిపోవచ్చు.
సైకిల్ పై చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చుట్టేయాలనుకునే వారికి ఈ సైకిల్ చాలా ఉత్తమంగా నిలుస్తుంది.
అలాగే దగ్గర్లోనే ఆఫీస్ కి వెళ్లాలనుకునే వారికి కూడా ఇది అనువుగా ఉంటుంది.
బ్రతకడానికి విద్య అవసరం లేదంటే ఇదే కాబోలు.. మహిళా ఇంగ్లీష్ అదుర్స్(వీడియో)