ఇన్స్టా గ్రామ్ లో సరికొత్త డౌన్ లోడ్ ఫీచర్.. ఎలా ఉపయోగించాలంటే..?
TeluguStop.com
ఇన్స్టా గ్రామ్( Instagram ) లో యూజర్లు రీల్స్ చూడడం కోసం, వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడం కోసం థర్డ్ పార్టీ పై ఆధారపడకుండా ఉండేందుకు ఓ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
ఈ ఫీచర్ తో యూజర్లకు ఇక పండగే.ఆ ఫీచర్ ఏంటో.
ఎలా ఆ ఫీచర్ ను ఉపయోగించుకోవాలో అనే వివరాలు చూద్దాం.ఇన్స్టా గ్రామ్ లో డౌన్లోడ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
ఈ ఫీచర్ తో యూజర్లు థర్డ్ పార్టీలపై ఆధారపడకుండా నేరుగా కావలసిన వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
"""/" /
ఇప్పటివరకు ఇన్స్టా గ్రామ్ లో రీల్స్( Instagram Reels ) లేదా వీడియోలను డౌన్లోడ్ చేసుకోవాలంటే థర్డ్ పార్టీని ఉపయోగించాల్సి వచ్చేది.
ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే డౌన్లోడ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.రీల్స్ షేర్ బటన్ లో ఈ ఫీచర్ ఉంటుంది.
కేవలం ఒకే ఒక సింగిల్ క్లిక్ తో రీల్స్ వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
"""/" /
ఈ ఫీచర్ ముందుగా అమెరికాలోని యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.తాజాగా భారత్ లో ఉండే యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.
పబ్లిక్ అకౌంట్స్ నుండి షేర్ చేసిన వీడియోలను ఈ ఫీచర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
రీల్స్ వీడియో షేర్( Reels Video Share ) బటన్ లోని కాపీ లింక్ బటన్ ప్రక్కనే ఈ ఫీచర్ ఉంటుంది.
పబ్లిక్ అకౌంట్ యూజర్ వారి రీల్స్ ను ఇతరులు డౌన్లోడ్ చేయకుండా చేసుకునే వీలు కూడా ఉంటుంది.
అందుకోసం సెట్టింగ్స్ లో ఉండే ప్రైవసీలో డౌన్లోడ్ ఆఫ్ చేస్తే చాలు.ఆ వీడియో డౌన్లోడ్ అవ్వదు.
పబ్లిక్ అకౌంట్ నుండి షేర్ చేసిన వీల్స్ డౌన్లోడ్ చేసినప్పుడు ఆ వీడియోల పైన యూజర్ పేరుతో పాటు ఆడియో వివరాలు కూడా వాటర్ మార్క్ అవుతాయి.
ఈ ఫీచర్ యూజర్లకు చాలా బాగా ఉపయోగపడుతుందని ఇన్స్టా గ్రామ్ తెలిపింది.
2025 స్ట్రీమింగ్ సినిమాలను ప్రకటించిన నెట్ ఫ్లిక్స్.. ఓజీ, మాడ్ స్క్వేర్ తో పాటు ఆ సినిమాలు!