మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ సింప్లీ సూపర్బ్.. బాలయ్యను మించిన హీరో అవుతాడా?

టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలయ్య బాబు( Balayya Babu ) తనయుడు మోక్షజ్ఞ( Mokshagna ) సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య బాబు అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.అయితే ఎట్టకేలకు అభిమానుల ఎదురుచూపులు ఫలించి మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే.

ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) దర్శకత్వంలో అతడి సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రాసుకున్న కథతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

"""/" / ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోక్షజ్ఞ లుక్( Mokshagna Look ) రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

చాలా హ్యాండ్సమ్ గా కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు మోక్షజ్ఞ.అయితే ఈ సినిమాను ఎప్పుడైతే అధికారికంగా ప్రకటించారో, ఆరోజే మోక్షజ్ఞ లుక్ కూడా రివీల్ చేశారు.

ఇప్పుడు మరో ఫొటో వదిలాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.పూర్తి స్థాయిలో మేకోవర్ అయిన మోక్షజ్ఞ క్లోజప్ షాట్ ను ప్రశాంత్ వర్మ విడుదల చేశాడు.

యాక్షన్ కోసం సిద్ధమా.అనే క్యాప్షన్ కూడా పెట్టాడు.

"""/" / అయితే ఇప్పుడీ లుక్ రిలీజ్ చేసిన తర్వాత ప్రాజెక్టుపై కొత్త చర్చ మొదలైంది.

ఈ లుక్ చూసిన చాలామంది లవ్ స్టోరీ చేస్తే బాగుంటుందని ఫీల్ అవ్వడం విశేషం.

ఆ ఫోటో చూసినా అభిమానులు మోక్షజ్ఞ లుక్ చాలా బాగుంది.ఇంకొందరు సూపర్ ఆసం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అయితే మోక్షజ్ఞ లుక్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అసలు మోక్షజ్ఞ నటిస్తున్న కథ ఏమిటి కథ ఎలా ఉండబోతోంది అన్న ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.

విద్యార్థినికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిన ఉపాధ్యాయుడిని చితకబాదిన తల్లిదండ్రులు