కారులో కొత్త పరికరం... మద్యం సేవించి డ్రైవర్ బండి నడిపితే అది కదలమన్నా కదలదు!
TeluguStop.com
ఈమధ్యకాలంలో చూసుకుంటే, ముఖ్యంగా మన ఆంధ్రాలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు నమోదయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
దీనికి గల కారణాలు ఏమయ్యుంటాని పరిశీలిస్తే, ఎక్కువశాతం మద్యం సేవించి డ్రైవింగ్ చేసినందువలనే జరిగాయని గణాంకాలతో తేలాయి.
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ముగ్గురు ఇంజనీర్లు దీనిపైన కసరత్తులు చేసారు.
మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే గనుక వాహనం స్టార్ట్ అవకుండా చేసే ఓ వినూత్న పరికరాన్ని వీరు కనిపెట్టారు.
వివరాల్లోకి వెళితే.ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన ఓ ముగ్గురు ఇంజినీర్లు ఈ ఐడియాకి శ్రీకారం.
ముందుగా భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న అజిత్ యాదవ్‌కు ఈ ఆలోచన తట్టింది.
ఆలోచన వచ్చిందే తడవుగా తన స్నేహితులైన మనీశ్, సిద్ధార్థ్‌లతో కలిసి కార్యాచరణ ప్రారంభించారు.
బొగ్గు రవాణా చేసే వాహనాల డ్రైవర్లు.తరచూ మద్యం సేవించి ప్రమాదాలకు గురవడాన్ని చూసి వారు ఈ పరికరాన్ని తయారు చేసేందుకు సిద్ధమయ్యారు.
వెంటనే ప్రత్యేక పరికరానికి వాహనాల్లో మద్యాన్ని పసిగట్టే భద్రతా వ్యవస్థను రూపొందించారు.అందువలన వారు స్థానికంగా ఎంతో ఫేమస్ అయ్యారు.
రోడ్డు ప్రమాదాల కారణంగా నేడు ఎంతోమంది జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి.మరెన్నో జీవితాలు రోడ్డున పడుతున్నాయి.
ఇలాంటి వారి జీవితాలలో వీరి ఐడియా వెలుగు నింపుతోంది. """/"/
ఈ సందర్భంగా వారిని ఓ మీడియా ప్రతినిధి కలవగా.
అజిత్ యాదవ్ మాట్లాడుతూ."ఆల్కహాల్ సెన్సర్ ఆధారంగా ఈ పరికరం పనిచేస్తుంది.
వాహన చోదకుడు ఆల్కహాల్ సేవించాడో? లేదో? అనే విషయాన్ని ఈ పరికరం నిక్కచ్చిగా గుర్తిస్తుంది.
డ్రైవర్ శ్వాసను విశ్లేషించి సెన్సర్‌కు ఆ సమాచారాన్ని పంపుతుంది.ఆల్కహాల్ ఆనవాళ్లు ఉంటే పరికరం డిస్ప్లేలో ఆ వివరాలు ప్రత్యక్షం అవుతాయి.
ఆ తర్వాత బజర్ మోగుతుంది.ఆ సిగ్నల్ ఇంధన పంప్‌నకు చేరగానే సరఫరా నిలిచిపోతుంది.
ఆల్కహాల్ సేవించినట్లు తేలితే.వాహనం స్టార్ట్ అవకుండా అడ్డుకుంటుంది" అని అజిత్ యాదవ్ తెలిపారు.