తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నూతన వధూవరులు మంచు మనోజ్ భూమా నాగ మౌనిక రెడ్డి
TeluguStop.com
తిరుమల శ్రీవారిని నూతన వధూవరులు మంచు మనోజ్., భూమా నాగ మౌనిక రెడ్డిలు దర్శించుకున్నారు.
ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో మనోజ్ దంపతులతో మంచు లక్ష్మీ దంపతులు కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయం వెలుపల మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.మౌనిక తో వివాహం అనంతరం తిరుమలకు రావడం చాల సంతోషంగా ఉందన్నారు.
జీవితంలో ఎందులోనైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమలో కాదు.నేడు మా ప్రేమ గెలిచిందన్నారు.
మా నాన్నగారి ఆశీస్సులు., అక్క సపోర్ట్.
, అత్తమామల ఆశీస్సులు మాపై ఉన్నంత వరకు ఎవరు ఏమి చేయలేరని తెలిపారు.
వరుసగా షూటింగ్లు ప్రారంభం అవుతున్నాయని తెలిపారు.రాజకీయాల్లో వచ్చే ఆలోచన నాకు లేదని.
ప్రజలకు సేవ చేయాలనీ మాత్రమే ఉందని అన్నారు.మౌనిక చేయాలనీ అనుకుంటే తనకి నా సపోర్ట్ ఉంటుందని స్పష్టం చేసారు.
మున్ముదు ఇద్దరం కలసి మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలి అనుకుంటున్నామన్నారు.శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారని.
అలా నా జీవితంలోకి మౌనిక రెడ్డి వచ్చిందన్నారు.గత నాలుగేళ్లుగా వేరే లోకంలో ఉన్న నన్ను మల్లి తిరిగి తీసుకొచ్చిందని తెలిపారు.
ఒకరికి ఒకరు తోడు ఉండాలని కోరుకున్నామన్నారు.అందుకే శివుని ఆజ్ఞతోనే అన్ని జరిగాయని అనుకుంటున్నానని.
బాబు నేను మౌనిక రెడ్డిలు నూతన జీవితంలోకి అడుగుపెట్టామన్నారు.కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు.
అది ఇదేనేమో అంటూ తన ఆనందాన్ని వ్యక్త పరిచారు.
ఆ ప్రముఖ హీరోయిన్ ను స్టార్ డైరెక్టర్ చెంపదెబ్బలు కొట్టారా.. ఏం జరిగిందంటే?