ఫ్రాన్స్‌లో వెలుగు చూసిన మరో వేరియంట్.. పేరేమిటి? ప్రభావమెంత?
TeluguStop.com
కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ భయం ప్రపంచాన్ని వెంటాడుతోంది.కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
ఇప్పుడు ఫ్రాన్స్‌లో (కోవిడ్-19 న్యూ స్ట్రెయిన్ ఇన్ ఫ్రాన్స్) కరోనా వైరస్ కు సంబంధించిన మరో కొత్త వైరస్ బయటపడింది.
ఈ వైరస్ ఇప్పటికే 12 మందికి సోకింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఫ్రెంచ్ పరిశోధకులు కొత్త కోవిడ్ వేరియంట్‌ను కనుగొన్నారు.
ఇది బహుశా కామెరూనియన్ మూలానికి చెందినదని వారు చెబుతున్నారు.వారు తాత్కాలికంగా దీనికి ఐహెచ్‌యూ అనే పేరు పెట్టారు.
ఈ వేరియంట్‌తో బాధపడుతున్న వ్యక్తి అప్పటికీ టీకా వేయించుకున్నారని, సెంట్రల్ ఆఫ్రికాలోని కామెరూన్‌కు వెళ్లి ఫ్రాన్స్‌కు తిరిగి వచ్చారని సమాచారం.
బాధితుడు శ్వాసకు సంబంధించిన తేలికపాటి లక్షణాలను కనిపించడంతో వైద్యులను సంప్రదించాడని నిపుణులు చెబుతున్నారు.
దీంతో అతనికి కొత్త కోవిడ్ 19 ఇన్‌ఫెక్షన్ నిర్ధారితమయ్యింది.అయితే ఈ వేరియంట్‌కు సంబంధించి ఇంకా ఎక్కువ సమాచారం అందలేదని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం శాస్త్రవేత్తలు కొత్త వేరియంట్‌పై పరిశోధనలు చేస్తున్నారు.ఈ కొత్త కోవిడ్ వేరియంట్‌తో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
కరోనా టీకా ఈ వేరియంట్‌ను అరికట్టడంలో సహాయపడుతుందన్నారు.కాగా ఈ వేరియంట్ ఒమిక్రాన్ మాదిరిగా వేగంగా వ్యాప్తి చెందకపోవడం ఉపశమనం కలిగించే విషయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ రిలీజ్ అప్పుడేనా.. అల్లు అర్జున్ మళ్లీ అదే తప్పు చేస్తున్నారా?