ఏటీఎం కార్డులు ఉన్నవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఈ దొంగతనాల గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా దొంగల ఆగడాలు మితిమీరి పోయాయి.దొంగలు చివరికి ఏటీఎం( ATM ) ను కూడా విడిచి పెట్టడం లేదు.

ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.అయితే కొందరు నకిలీ డెబిట్ కార్డులతో డబ్బులు కాజేస్తే, ఇంకొందరు ఏకంగా ఏటీఏం మెషీన్ ను దోచుకెల్తున్నారు.

వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం.ఇంకొందరు పిన్ నంబర్ దొంగిలించడం, మరికొందరు డబ్బులొచ్చే చోట రహస్యంగా మరో డబ్బా ఏర్పాటుచేయడం లాంటివి చేస్తున్నారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటన్నింటికీ మించి ఒక హైటెక్ ఏటీఎం దొంగతనం( Hi-tech ATM Theft ) తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది.

దీంతో ఆ విషయం తెలుసుకున్న ప్రజలు నూరేళ్ల పెడుతున్నారు.కొంతమంది అప్రమత్తమవుతున్నారు.

ఆ వివరాల్లోకి వెళితే. """/" / దొంగలు( Thieves ) మామూలు వ్యక్తులు లాగే డబ్బులు డ్రా చేయడం కోసం ఏటీఏంలోకి వెళ్తున్నారు.

ఎవరికి అనుమానం రాకుండా అందరిలానే డబ్బులు డ్రా చేస్తున్నారు.ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది.

వాళ్ళ చేతికి డబ్బు వస్తోంది కానీ వాళ్ల ఎకౌంట్ల నుంచి మాత్రం డబ్బులు కట్ అవ్వడం లేదు.

అదే మేజిక్.ఇలా లక్ష, 2 లక్షలు దొంగతనం చేశారు అనుకుంటే పొరపాటు పడినట్టే.

ఎందుకంటే అలా ఏకంగా కోట్ల రూపాయలు కొల్లగొట్టారు దొంగల గ్యాంగ్.తెలంగాణ, ఏపీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఇలానే డబ్బు మాయం అయ్యింది.

మరీ ముఖ్యంగా భద్రాద్రిలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్( Urban Cooperative Bank, Bhadradri ) ఏటీఏంలో భారీగా డబ్బు పోయింది.

దాదాపు వంద మంది వరకు గ్యాంగ్ ఈ పని చేస్తోంది.వీళ్ల చేతుల్లో సుమారు 75 ఏటీఎం కార్డులు ఉన్నాయి.

ఇది ఎలా సాధ్యం అనే కదా మీ డౌట్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎవ్వరికీ అనుమానం రాకుండా, ఇద్దరు ఏటీఎంలోకి వెళ్తారు. """/" / వీళ్లలో ఒకడు ఏటీఎంలో కార్డు పెడతాడు.

లావాదేవీ చేస్తాడు.మరొకడు ఏటీఎంకు విద్యుత్ సరఫరా అయ్యే ప్రాంతంలో కట్టర్ తో సిద్ధంగా ఉంటాడు.

ఎప్పుడైతే ఏటీఎం మెషీన్ నుంచి డబ్బులు బయటకొస్తాయో, సరిగ్గా టైమ్ చూసి ఈ రెండో వ్యక్తి ఏటీఎంకు పవర్ కట్ చేస్తాడు.

ఇలా చేయడం వల్ల మెషీన్ నుంచి డబ్బులు బయటకొస్తాయి కానీ, సదరు వ్యక్తి ఎకౌంట్ నుంచి మాత్రం ఆ డబ్బులు కట్ అవ్వవట.

అయితే దొంగలు ఆలోచించినా ఈ తీరుకి పోలీసులు నిజంగా షాక్ అవుతున్నారు.లోలోపల హాట్సాఫ్ చెబుతూనే చేతులకు బేడీలు వేసి కటకటాల వెనక్కి తోస్తున్నారు.

సాయిపల్లవి యాక్టింగ్ తో తండేల్ రికార్డులు క్రియేట్ చేయడం పక్కా.. ఏం జరిగిందంటే?