తెలంగాణాలో ఈ నెల 16 నుండి కొత్త విద్యా సంవత్సరం మొదలు..!

తెలంగాణాలో విద్యాసంస్థల ప్రారంభానికి ప్రభుత్వం మొగ్గు చూపుతుంది.అందిన సమాచారం మేరకు ఈ నెల 16 నుండి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుందని చెబుతున్నారు.

8 నుండి 10వ తరగతి, ఇంటర్ విద్యార్ధులకు ఆన్ లైన్ క్లాసులు తీసుకోనున్నారు.

విద్యార్ధులు నష్టపోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చూస్తుంద్.కరోనా ఉదృతి వల్ల పాఠశాలు, కళాశాలలు ఎప్పుడు తెరుస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

లాస్ట్ ఇయర్ ఆన్ లైన్ క్లాసెస్ రన్ చేశారు.ఇక ఈ అకడమెక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది మొన్నటి వరకు కన్ డౌట్ ఉండగా విద్యాశాఖ ఈ నెల 16 నుండి కొత్త విద్యా సంవత్సరం కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక కరోనా కేసులు తగ్గుముఖం పడితే రోజు విడిచి రోజు స్కూల్స్ కూడా తెరచే అవకాశం ఉందని తెలుస్తుంది.

స్కూళ్లను అందుకు సిద్ధం చేసుకోమని కూడా ప్రభుత్వం నుండి సూచనలు వస్తున్నాయి.కరోనా వల్ల విద్యార్ధుల మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది.

ఆన్ లైన్ క్లాసులు ఎంత విన్నా సరే ఫిజికల్ క్లాసెస్ విన్నట్టుగా ఉండదు.

కాని అది కూడా మిస్సైతే అకడమెక్ ఇయర్ మిస్ అవుతామన్న ఆలోచనతో స్టూడెంట్స్ ఉన్నారు.

కరోనా తీవ్రత తగ్గితే మాత్రం ప్రభుత్వం స్కూల్స్ రీ ఓపెనింగ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

జగన్ ప్రమాణ స్వీకార తేదీన త్వరలో ప్రకటిస్తామంటున్న మంత్రి బొత్స..!!