ఈ నెల 28వ తేదీనా నేవూరి వెంకట్ రెడ్డి 9వ వర్ధంతిని విజయవంతం చేయండి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద గాంధేయ వాది స్వర్గీయ కీర్తి శేషులు నేవూరి వెంకట్ రెడ్డి 9వ వర్ధంతి ని ఈ నెల 28 వ తేదీ నా ఉదయం 9 -00 గంటలకు ఘనంగా నిర్వహించడానికి వికలాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు కటుకం రాంచంద్రం, అల్లం లక్ష్మణ్, ద్యాగం రాములు, రావుల మల్లారెడ్డి,మేగి నర్సయ్య లు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా వారు స్వంత ఖర్చులతో నేవూరి వెంకట్ రెడ్డి ప్లేక్సి ని అదే విధంగా ఆయన వర్ధంతి సందర్భంగా వర్ధంతి కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని అన్నారు.

వీరు తమ స్వంత ఖర్చులతో నే నేవూరి వెంకట్ రెడ్డి కి మొదటి నుంచి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

దాతల ఆర్థిక సహాయం తో నేవూరి వెంకటరెడ్డి పాలరాతి విగ్రహం తయారు చేయించి వచ్చే యేడాది జూన్ 28 వ తేదీన 10 వ వర్ధంతి ని ఘణంగా నిర్వహించాలని నిర్ణయించారు.

విరాళాలు ఇవ్వడానికి దాతలు కూడా సిద్ధం ఉన్నట్లు ఈ మేరకు విరాళాలను వర్ధంతి రోజున దాతలు నుంచి తీసుకోవాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు హరీష్ శంకర్ పై పెరుగుతున్న ఒత్తిడి.. ఉస్తాద్ తో లక్ష్యాన్ని సాధిస్తాడా?