రాత్రి 10 గంటల తర్వాత టాయిలెట్‌ ఫ్లష్ చేస్తే అక్కడ నేరంగా పరిగణిస్తారట.. ఎక్కడబ్బా?

ఇదెక్కడి చోద్యమని నవ్వకండి.మీరు విన్నది నిజమే.

దేశదేశానికి చట్టాలు అనేవి మారిపోతూ ఉంటాయి.కొన్నిసార్లు ఈ చట్టాలు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తాయి.

మరికొన్ని భిన్నమైనప్పటికీ ఆయా దేశాల సాంస్కృతిక విలువలను సూచిస్తాయి.మరికొన్ని అలాంటివాటికి విరుద్ధంగా ఉంటాయి.

బేసిగ్గా అలాంటి చాలా ఇంట్రస్టింగ్ చట్టాలు మనకు స్వీడ్జర్లాండ్‌లో కనిపిస్తాయి.ఒక వేళ ఎప్పుడైనా మీరు స్వీడ్జర్లాండ్‌ వెళ్తే మాత్రం వీటిని గుర్తు పెట్టుకోండి.

లేకుంటే అక్కడ మీరు ఫైన్ కట్టాల్సి ఉంటుంది.లేదా జైలు పాలు కావాల్సి ఉంటుంది.

స్వీడ్జర్లాండ్‌లో రాత్రి 10 గంటల తర్వాత టాయిలెట్స్‌ ఫ్లషింగ్ చేయడం నేరం.అలాగే టాయిలెట్‌లో నిల్చొని మూత్రం పోయడం కూడా నేరమే.

అలాంటివి రాత్రి పది గంటల ముందే కానిచ్చేయాలి.ఇలా చేయడం వల్ల వచ్చే శబ్దం ఇతరులను ఇబ్బంది పెడుతుందన్న కారణంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ఇక్కడి ప్రభుత్వం.

అలాగే అక్కడ పిల్లలకు పేర్లు పెట్టడం పెద్ద టాస్క్.డెలివరీ కాక ముందు నుంచే చాలా మంది పేర్లపై కసరత్తు చేస్తుంటారు.

అబ్బాయి పుడితే ఈ పేరు పెట్టాలి.అమ్మాయి పుడితే ఈ పేరు పెట్టాలనే డిస్కషన్ చేస్తుంటారు.

పెద్ద లిస్టే రెడీ చేసుకుంటారు. """/"/ ఈ విషయంలో బేసిగ్గా మనం తాతముత్తాతల పేర్లు, ఇష్టదైవాల పేర్లు పెడుతుంటారు.

లేదంటే ఏదైనా మనకు నచ్చిన పేరునే పెడుతుంటాం.అదే స్వీడ్జర్లాండ్‌లో అయితే మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది.

అక్కడ పిల్లలకు పేర్లు పెట్టాలంటే మాత్రం అధికారుల అనుమతి తప్పనిసరి.ఫ్యామిలీ అనుకున్న పేర్ల లిస్ట్‌ను అధికారులకు ఇస్తే వాళ్లు దాన్ని పరిశీలించి ఆమోదించిన పేర్లు మీకు ఇస్తారు.

అందులో నుంచి ఒక పేరును పిల్లలకు పెట్టవలసి ఉంటుంది.అందులో భవిష్యత్‌ లో పిల్లలు తన పేరు విని బాధ పడేకుండా ఉండేందుకు ఈ జాగ్రత్త తీసుకుంటారు.

ఇతరులు అభ్యంతరం చెప్పకుండా జాగ్రత్త పడతారు.అలాగే స్విట్జర్లాండ్‌లో కుక్కలు పెంచుకుంటే పన్ను చెల్లించాలి.

సో దీని బట్టి మీకు అర్ధమైనదమిటి.మనం ఏ దేశమైన వెళ్ళేటప్పుడు ముందుగా అక్కడి చట్టాలను తెలుసుకోవడం ఎంతో అవసరం.

అమ్మాయిలు రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తుంటే అడ్డుకోవడానికి వచ్చిన హాస్టల్ వార్డెన్‌.. చివరికి?