ఈ వ్యక్తులతో అస్సలు శత్రుత్వం పెట్టుకోకండి.. పెట్టుకుంటే మీకే నష్టం..!
TeluguStop.com
ఆచార్య చాణక్యుడు( Acharya Chanakya ) ప్రకారం మనం ఎవరితోనూ శత్రుత్వం కలిగి ఉండకూడదు.
తెలియకుండా కూడా శత్రుత్వం అస్సలు పెట్టుకోకూడదు.చాణక్యుడు చెప్పేదేమిటంటే జీవితంలో అభివృద్ధి చెందాలంటే సమస్యలను నివారించి, సంతోషకరమైన జీవితాన్ని గడపాలి అంటే ఈ ఆరు మందితో అస్సలు ఎప్పటికీ కూడా శత్రుత్వం( Enmity ) ఉంచుకోకూడదు.
ఇప్పుడు ఆ ఆరుగురు ఎవరో తెలుసుకుందాం.రాజు లేదా పాలకులతో శత్రుత్వం అసలు పెట్టుకోకూడదు.
వారితో ఒప్పగా అంటే ప్రాణాలకు ముప్పు కలుగుతుంది.వారితో పోరాడుతున్నప్పుడు లేదా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
అధికారులతో శత్రుత్వం పెట్టుకుంటే మాత్రం చాలా వరకు మీ పనులు అస్సలు జరగవు.
అందుకే ఎప్పటికీ వారితో బాగుండాలి.ఒక వ్యక్తి తనను తాను ద్వేషించుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
తనను తాను అగౌరవపరుచుకుంటే, తన శరీరాన్ని, మనస్సును జాగ్రత్తగా చూసుకోకపోతే, మరణం ( Death ) ఎప్పుడైనా వారిని చేరుకోవచ్చు.
ఇక ఇతరులు మనల్ని గౌరవించాలని ఆశించేముందు ముందుగా మనల్ని మనం గౌరవించాలి.మనకు మనం నచ్చకపోతే జీవితంలో ఏదీ కూడా మనకు నచ్చదు.
అంతేకాకుండా బతకాలని ఆశ కూడా తగ్గిపోతుంది. """/" /
ధనపరంగా, శారీరకంగా ఆయుధాలతో బలమైన వ్యక్తితో పోరాడడం మరణాన్ని ఆహ్వానిస్తుంది.
చాణక్య చెప్పింది ఏమిటంటే మనం తెలివైన వారితో( Clever Persons ) లేదా బలవంతులతో పోరాడినప్పుడు మనం కూడా వారిలాగే బలంగా ఉండాలి.
కాబట్టి బలవంతులతో యుద్ధం చేసేటప్పుడు చాలా రకాలుగా ఆలోచించాలి.చిన్న పొరపాటు చేసిన కూడా మొత్తం జీవితం ముగిసిపోతుంది.
మూర్ఖులతో స్నేహం, వారితో శత్రుత్వం అసలు మంచిది కాదు.వారికి దూరంగా ఉండటమే మంచిది.
మూర్ఖులు( Fools ) మీ ప్రతిష్టకు భంగం కలిగిస్తారు.వారితో వైరం మీకు అవమానాన్ని తీసుకొస్తుంది.
వారికి ఎంత దూరం ఉంటే మీ జీవితం అంత బాగుంటుంది. """/" /
ఇక మీకు చికిత్స చేసే వైద్యుడితో( Doctor ) మీకు వండి పెట్టే వంట వారితో కూడా ఎప్పుడూ గొడవ పెట్టుకోకూడదు.
వైద్యులతో సరిగా ఉంటే మీతో వారు సరిగా ఉంటారు.వండి పెట్టే వారితో గొడవ పెట్టుకుంటే మీకు వారు సరైన ఆహారాన్ని ఇవ్వరు.
ఇక మీ రహస్యాలన్నీ తెలిసిన స్నేహితుడు( Friend ) మీకు శత్రువుగా మారడం మీకు మరింత ప్రమాదకరం.
మీ రహస్యాలన్నీ తెలిసిన స్నేహితుడితో శత్రుత్వం నీకు నువ్వే గొయ్యి తవ్వుకున్నట్లు అవుతుంది.
అందుకే కొన్ని విషయాలు కూడా ఎవరితో చెప్పుకోకూడదు.స్నేహం చేసే ముందు ఆలోచించాలి.
అలాగే అన్ని విషయాలు కూడా చెప్పుకోకూడదు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్6, ఆదివారం 2024