ఈ వస్తువులను పొరపాటున ఇతరులకు ఇచ్చిన దురదృష్టమే!

దేవుడు ఉన్నాడో, లేడో  ఎవరికీ తెలియదు కానీ, ఏదో శక్తి మాత్రం మనల్ని నడిపిస్తుందనేది మాత్రం నిజం.

మన జీవితంలో ప్రతికూల శక్తి, అనుకూల శక్తి అనే రెండు రకాల శక్తులు ప్రసారం అవుతూ ఉంటాయి.

మన జీవితంలో లేదా ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడినప్పుడు మన కుటుంబం అల్లకల్లోలంగా మారి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణమే.కానీ కొందరు కొన్ని పనులు చేయటం వల్ల సమస్యలను మనమే మన జీవితంలోకి ఆహ్వానించినట్లు అవుతుంది.

కొందరు ఇతరులకు తమ వస్తువులను ఇస్తూ ఉంటారు.అలా ఇవ్వడం వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి.

అయితే ఏ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు, ఇవ్వడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

చాలా మంది చేసే అతి పెద్ద పొరపాటు ఏమిటంటే, ఒకరి దుస్తులను మరొకరు వాడుతూ ఉంటారు.

ఇతరుల దుస్తులను వాడటం వల్ల వారి జీవితంలో ఏర్పడిన ప్రతికూల శక్తి మన జీవితంలోకి వస్తుంది.

అంతేకాకుండా ఇతరుల దుస్తులు ధరించి ఏదైనా శుభకార్యానికి లేదా ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు, ఆ పనులు ఏదో ఒక కారణం చేత వాయిదా పడతాయి.

"""/" / మన ఇంట్లో పూజ గదిలో ఉన్న శంకువును పొరపాటున కూడా ఎవరికి ఇవ్వకూడదు.

పురాణాల ప్రకారం శంకువుని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిదేవి గా భావిస్తారు.అందువల్ల మన ఇంట్లో ఉన్న శంకువును ఇతరులకు ఇవ్వటం ద్వారా మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని మనం బయటకు పంపినట్లే.

ఒకవేళ అత్యవసర పరిస్థితులలో ఇవ్వాల్సి వస్తే తిరిగి వారి నుంచి శంకువును తీసుకుని శుద్ధమైన గంగాజలంతో కడిగే పూజ చేసుకోవాలి.

"""/" / చాలా సందర్భాలలో మనం ఇతరుల దగ్గర నుంచి మన అవసరం నిమిత్తం పెన్ను తీసుకొని, వాటిని తిరిగి ఇవ్వడం మర్చిపోతాము.

అలా ఇతరుల పెన్ను తీసుకోవడం ద్వారా ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

అలాగే పెట్టుబడి సంబంధిత విషయాలలో తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.కాబట్టి ఇతరుల నుంచి పెన్ను తీసుకుంటే, వెంటనే వారికి తిరిగి ఇవ్వడం ఎంతో ఉత్తమం.

ఇలాంటి వస్తువులను పొరపాటున కూడా ఇతరులకు ఇవ్వకూడదు,ఇతరుల నుంచి తీసుకోకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

బీఆర్ఎస్ కు మళ్లీ గుర్తుల టెన్షన్ !