అమెరికాలో రాష్ట్ర విభజన ఉద్యమం..!!!

అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రాన్ని రెండుగా చేయాలంటూ ఎన్నో ఏళ్ల నుంచీ నిరసనలు ప్రభుత్వానికి తెలుపుతూ వచ్చారు.

ల అయితే ఈ అంశం మరో సారి తెరపైకి వచ్చింది.రిపబ్లికన్ అసెంబ్లీమేన్‌ స్టీవ్‌హాలే ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు.

న్యూయార్క్‌ ఉత్తర ప్రాంతం(అప్‌స్టేట్‌), నుంచీ దక్షిణ ప్రాంతానికి (డౌన్‌స్టేట్‌) వేరుగా విభజించాలని ఆయన సరికొత్త బిల్లును సభలో ప్రవేశపెట్టారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఉత్తర , దక్షిణ ప్రాంతాల వారికి సంపాదన విషయంలో , ఖర్చుల విషయంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి మాకు రాష్ట్ర విభజన అనివార్యమని అన్నారు.

అయితే ఇది ఆచరణలో ఎంతవరకూ సాధ్యం అవుతుందనేది మరింత లోతుగా అధ్యయనం చేసి చర్చించాలని అన్నారు.

తాను ప్రవేశపెట్టిన బిల్లు అసెంబ్లీలో పాసైతే.ఇక ఓటర్లదే తుది నిర్ణయమని ఆయన సృష్టం చేశారు.

అంతేకాకుండా అబార్షన్‌ బిల్‌, గన్ కంట్రోల్ బిల్ .డ్రీమ్ యాక్ట్ వంటి వివాదాస్పద బిల్లులు కూడా ఇటీవల అసెంబ్లీలో అమలు అయ్యాయని వాటిలాగానే ఈ బిల్లు కూడా అమలు అవుతుందని భావిస్తున్నట్లుగా ఆయన తెలిపారు.

ఈ బిల్లుపై విభజన కోరుకునే ఎంతో మంది ప్రజలు ఎదురు చూస్తున్నట్లుగా ఆయన తెలిపారు.

ఢిల్లీలో 12 పాఠశాలలకు బాంబు బెదిరింపులు..!