అనుకున్నంత పని చేసేసిన నిహారిక… శుభాకాంక్షలు చెబుతున్న నెటిజెన్స్!
TeluguStop.com
మెగా డాటర్ నిహారిక (Niharika)తన వ్యక్తిగత కారణాల వల్ల గత కొంతకాలంగా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా ఈమె తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యకి విడాకులు(Divorce) ఇవ్వబోతున్నారని, ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే వార్తలు జోరుగా వినపడుతున్నాయి.
ఈ విధంగా నిహారిక చైతన్య విడాకుల వార్తలు పెద్ద ఎత్తున వైరల్ కావడంతో పలువురు ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.
అందుకు అనుగుణంగా నిహారిక వెంకట చైతన్య ఇద్దరు కూడా తమ ఇంస్టాగ్రామ్ లో వీరు పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో అనుమానాలు మరింత బలం అవుతున్నాయి.
"""/" /
ఇలా నిహారిక విడాకుల వార్తల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.
అయితే ఈ విషయం గురించి మెగా ఫ్యామిలీ ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు.
గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరమైనటువంటి నిహారిక తిరిగి సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు.
ఈ క్రమంలోనే తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
అయితే నిహారిక పెళ్లి కాకముందు ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.
పెళ్లి తర్వాత ఈమె తన నటనకు గుడ్ బై చెప్పి నిర్మాతగా స్థిరపడ్డారు.
"""/" /
నిహారిక సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్స్(Pink Elephant Picture Banners) స్థాపించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ బ్యానర్ పై ఇది వరకే పలు వెబ్ సిరీస్ లను నిర్మించి నిర్మాతగా సక్సెస్ అయ్యారు.
ఇకపోతే నిహారిక మరొక అడుగు ముందుకు వేసి తన ప్రొడక్షన్ బ్యానర్ కు ఒక ఆఫీస్(Office) ఏర్పాటు చేశారు.
ఎప్పటినుంచో సొంతంగా ఆఫీస్ ప్రారంభించాలని కలలు కంటున్నటువంటి నిహారిక చివరికి అనుకున్నంత పని చేసి తన బ్యానర్ కోసం ఆఫీస్ ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.ఈ క్రమంలోనే ఈ ఫోటోలను నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు తనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.