Vithika Sheru : శ్రీదేవి గెటప్ లో వితికా… మాకు ఇదేం కర్మ అంటూ దారుణంగా ఆడుకుంటున్న నెటిజెన్స్?
TeluguStop.com
పడ్డానండి ప్రేమలో మరి అనే సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి వితికా షేరు( Vithika Sheru ) .
వరుణ్ సందేశ్ ( Varun Sandesh ) తో కలిసి ఈమె ఈ సినిమాలో నటించారు.
అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈమె మాత్రం వరుణ్ సందేశ్ ప్రేమలో పడ్డారు ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ కూడా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
అయితే పెళ్లి తర్వాత ఈమె పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.మరోవైపు వరుణ్ సందేశ్ కి కూడా పెద్దగా సినిమా అవకాశాలు రాలేదని చెప్పాలి.
"""/" /
ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి వీరిద్దరికీ బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా సందడి చేసినటువంటి ఈ జంట అనంతరం పలు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి యూట్యూబ్ వీడియోల ద్వారా సందడి చేస్తున్నారు.
ప్రస్తుతం వరుణ్ సందేశ్ పలు సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేయగా ఈమె మాత్రం యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.
"""/" /
ఇక ఈ మధ్యకాలంలో వేదిక మెగా డాటర్ నిహారికతో మంచి దోస్తీ ఏర్పరచుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా నిహారిక తో కలిసి పలు రకాల వీడియోలు చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈమె శ్రీదేవి( Sridevi ) గెటప్ లో సందడి చేశారు.
అచ్చం జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలోని శ్రీదేవి గెటప్ లో తయారయ్యి ప్రియతమా అనే పాటను రీ క్రియేట్ చేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో పై దారుణమైన కామెంట్స్ చేస్తూ నేటిజన్స్ ఈమెను ఓ ఆట ఆడుకుంటున్నారు.
"""/" /
ఇలా ప్రియతమా అనే పాటను రీ క్రియేట్ చేస్తూ ఈమె ఈ వీడియోని శ్రీదేవి వర్సెస్ వితికా అంటూ ఈ వీడియోని షేర్ చేయడంతో పెద్ద ఎత్తున ఈ వీడియో పై నేటిచెన్స్ కామెంట్ చేస్తూ శ్రీదేవికి మీకు ఏమైనా సంబంధం ఉందా అంటుకొందరు కామెంట్లు చేయక ఈ వీడియో చివరిలో వచ్చినది ఎవరు ఆర్జీవినా అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఆవిడ శ్రీదేవి అయితే మీరు మాత్రం ఫ్రీదేవి అంటూ దారుణంగా ఈమె పట్ల కామెంట్స్ చేస్తున్నారు.
అసలు ఇదే మాకు కర్మ రా అంటూ కొందరు ఈమెను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.
ఇప్పుడు కనుక శ్రీదేవి ఉంటే నిన్ను ఇలా చూసే ఆమె ఇప్పుడు మరణించేది.
మరికొందరు ఈ వీడియో పై దారుణమైన కామెంట్లతో ఈమెను ట్రోల్ చేస్తున్నారు.ఇలా ఓల్డ్ ఏజ్ పేస్ వేసుకుని శ్రీదేవిలా చేయడం ఏంటి మా కర్మ కాకపోతే అంటూ ఈ వీడియో పై దారుణమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు.
ఈయన చేసిన పనికి ఇంటర్నెట్ షాక్.. మ్యాప్‌లో డ్యాన్స్ బొమ్మ గీయడానికి 1105 కి.మీ పరిగెత్తాడా?