నువ్వు మారవా అంటూ వేణుస్వామిపై ట్రోల్స్.. జాతకం నిజం కాకపోతే ఏం చేస్తావంటూ?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జాతకాలు, పొలిటీషియన్ల జాతకాలు చెప్పడం ద్వారా వేణుస్వామి( Venuswami ) ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యారు.
ఒకప్పుడు వేణుస్వామి చెప్పిన జాతకాలు నిజం కాగా ఇప్పుడు మాత్రం వేణుస్వామి అంచనాలు తప్పుతున్నాయనే సంగతి తెలిసిందే.
రాజకీయాలకు సంబంధించి అంచనాలు తప్పిన తర్వాత తాను సెలబ్రిటీల జాతకాలు చెప్పనంటూ వేణుస్వామి చెప్పుకొచ్చారు.
అయితే 2027 సంవత్సరంలో చైతన్య , శోభిత( Chaitanya, Shobhita ) విడిపోతారంటూ వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే వేణుస్వామి అంత తొందరెందుకు అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.వేణుస్వామి సెలబ్రిటీల జాతకాల గురించి ఇష్టానుసారం కామెంట్లు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.
వేణుస్వామి జాతకం నిజం కాకపోతే ఏం చేస్తాడంటూ మరి కొందరు చెబుతున్నారు. """/" /
వేణుస్వామి తాను చెబుతున్న జాతకాల వల్ల భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి తీవ్రస్థాయిలో నష్టపోక తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వేణుస్వామి జాతకాల సక్సెస్ రేటు కేవలం 50 శాతం మాత్రమేనని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.
వేణుస్వామి అనవసర విమర్శలకు, వివాదాలకు ఛాన్స్ ఇవ్వకపోతే బాగుంటుందని అక్కినేని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
"""/" /
అక్కినేని హీరోలంటే వేణుస్వామికి పగ ఎందుకు అని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
వేణుస్వామి జాతకాలను సమర్థించే వాళ్ల కంటే విమర్శించే వాళ్లే ఎక్కువగా ఉన్నారు.వేణుస్వామి జాతకాలు నిజం కాకపోతే రాబోయే రోజుల్లో ఈ ట్రోల్స్ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.
వేణుస్వామి తన పాపులారిటీ కోసం సెలబ్రిటీల జాతకాల( Celebrity Horoscopes ) గురించి ప్రస్తావిస్తున్నారని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.
వేణుస్వామి అక్కినేని ఫ్యామిలీని పదేపదే టార్గెట్ చేస్తున్నారని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
వేణుస్వామిపై ప్రజల్లో కూడా గతంతో పోల్చి చూస్తే నమ్మకం తగ్గుతోందని ప్రచారం జరుగుతోంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 4, శుక్రవారం 2024