పెళ్లి తర్వాత ఇంత బోల్డ్ గా తయారయ్యారేంటి? ప్రణీత సుభాష్ పై ట్రోల్స్?
TeluguStop.com

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్.ఇక ఈమె గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.


తన అందమైన కళ్ళతో ప్రేక్షకులను ఫిదా చేసింది.నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలువలేకపోయింది.


ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం బాగా టచ్ లో ఉంటుంది.
ప్రణీత తొలిసారిగా ఏం పిల్లో.ఏం పిల్లడో అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.
ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో నటించి తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత బ్రహ్మోత్సవం, రభస వంటి పలు సినిమాలలో నటించింది.కానీ ఎందుకో టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా మెప్పించలేకపోయింది.
ఈమె టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించింది.అంతేకాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించి తనేంటో నిరూపించుకుంది.
ఇక ఈ ముద్దుగుమ్మ గతంలో కోవిడ్ సమయంలో కూడా ఎంతో మంది ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది.
"""/"/
ప్రణీత ఫౌండేషన్ పేరు మీద ఇప్పటికీ చాలా మందికి సహాయం చేస్తూనే ఉంది.
ఇక ప్రణీత బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే ఓ బడా బిజినెస్ మాన్ ను అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది.
ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.ఇక ప్రణీత సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.
అప్పుడప్పుడూ తన వ్యక్తిగత విషయాలను, తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను పంచుకుంటుంది.కానీ తన భర్త ఫోటోలు ఎక్కువగా పంచుకోదు.
పంచుకున్న కూడా ఫేస్ కనిపియ్యకుండా కవర్ చేస్తూ ఉంటుంది ప్రణీత.ఈమధ్య తన కూతురు ఫోటోలను కూడా పంచుకుంటుంది.
తన ఫేస్ కూడా కనిపించకుండా కవర్ చేస్తుంది.ఈమధ్య బాగా గ్లామర్ ను పెంచేసింది.
"""/"/
తన ఫాలోవర్స్ తో కూడా బాగా ముచ్చట్లు పెడుతుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.
గత కొన్ని రోజుల నుండి ఈ ముద్దుగుమ్మ వెకేషన్స్ అంటూ తిరుగుతూ గ్లామర్ లుక్ లకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.
అయితే తాజాగా కూడా ఒక గ్లామర్ ఫోటో పంచుకోవడంతో ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.
"""/"/
తను ఏదో రీసర్ట్ లో ఉన్నట్లు కనిపించగా అక్కడ ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లో కనిపించింది.
దీంతో ఫోటో కు స్టిల్ ఇవ్వగా ఆ ఫోటోని చూసిన నెటిజన్స్ తెగ లైకులు కొడుతున్నారు.
అంతేకాకుండా కామెంట్లు కూడా పెడుతున్నారు.ఇక ఓ నెటిజన్ మాత్రం.
పెళ్లి తర్వాత ఇంత బోల్డ్ గా తయారయ్యారేంటి అంటూ ప్రశ్నించగా ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.
రామ్ చరణ్ తో తీసే మూవీ పక్కా హిట్.. మెగా ఫ్యాన్స్ కు బుచ్చిబాబు హామీ ఇదే!