ఫ్యాన్స్ సెంటిమెంట్.. ఆ స్టార్ హీరో వేరే హీరోల సినిమాలలో అంటే అవి పక్కా ప్లాపే?

ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు, దర్శక నిర్మాతలకు సెంటిమెంట్లు అనేవి బాగా ఉంటాయి.ఒక సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఆ సినిమా విడుదల వరకు ఎన్నో సెంటిమెంట్లు పాటిస్తుంటారు.

కొన్నిసార్లు సెంటిమెంట్ పరంగానే సినిమాలు విడుదల చేస్తూ ఉంటారు.అలా స్టార్ హీరోల అభిమానులు కూడా కొన్ని సెంటిమెంట్ లు ఫాలో అవుతుంటారు.

ముఖ్యంగా తమ అభిమాన హీరోల సినిమాల విషయంలో బాగా సెంటిమెంటును నమ్ముతారు.తమ అభిమాన స్టార్ హీరో నటించిన ప్రతి సినిమాకు ఒకటే సెంటిమెంటును ఫాలో అవుతారు.

కానీ ఒక్క సినిమాలో ఆ సెంటిమెంట్ రాకపోతే ఆ సినిమా డిజాస్టర్ అని నమ్ముతారు.

అలా ఇప్పటికీ చాలామంది అభిమానులు ఇటువంటివి ఎదుర్కొన్నారు.కొన్ని కొన్ని సార్లు వ్యతిరేక పరంగా కూడా కొన్ని సెంటిమెంట్లు అనేవి ఉంటాయి.

అవి నటుల పరంగానే కాకుండా అభిమానుల నుండి కూడా సెంటిమెంట్లు ఉంటాయి.తమ అభిమాన హీరో సినిమా విడుదలైంది అంటే చాలు కొన్ని సెంటిమెంట్లు పాటిస్తూ సినిమాకు వెళ్తారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.మామూలుగా ఒక సినిమాకు సంబంధించిన ఏవైనా ఈవెంట్లలో ఎవరైనా ముఖ్య అతిథిగా వస్తే వారికి బాగా ప్రాధాన్యత ఇస్తారు.

ఎందుకంటే ఆ గెస్ట్ తోనే ఆ సినిమాకు సంబంధించిన కొన్ని విడుదల చేసే బాధ్యతలు అందిస్తారు.

ఒకవేళ ఆ సినిమా సక్సెస్ అవుతే ఆ ముఖ్య అతిధిని మరో సినిమా ఫంక్షన్ కు కూడా పిలుస్తారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇలాంటివే జరుగుతున్నాయి.ఎందుకంటే ఆ ముఖ్య అతిధిని సెంటిమెంట్ గా భావిస్తారు.

ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందో అది ఆ అతిథి రాక వల్లనేమో అని ఆందోళన పడుతుంటారు.

"""/" / చాలావరకు ఇటువంటివి ఇప్పటివరకు అతిథి రాక వల్ల అని అనుకోలేదు.

ఎందుకంటే తాము తీసిన సినిమాలు ప్రేక్షకులకు నచ్చనప్పుడు వచ్చిన అతిథి ఏం చేస్తాడు చెప్పండి.

ఎందుకంటే ఆ సినిమాలో తాను ఎటువంటి పాత్ర కూడా పోషించడు.కానీ ఆ అతిథి వల్లే అని సినీ ప్రముఖులు కాకున్నా చూసే ప్రేక్షకులు అనుకుంటారు.

అలా కొన్ని సందర్భాలలో కొందరి హీరోల సినిమాలలో ఇతర హీరోలకు సంబంధించిన ఫోటోలు కానీ, వాయిస్ ఓవర్ లాంటివి ఉంటుంటాయి.

ఆ సమయంలో ఆ హీరోల సినిమాలు పొరపాటున డిజాస్టర్ అవుతే మాత్రం కచ్చితంగా వాయిస్ ఓవర్ చేసిన హీరో వల్లనే ఇదంతా జరిగింది అనే సెంటిమెంటును అడ్డు పెడతారు.

"""/" / ఇప్పుడు అలాంటి పరిస్థితి ఒక హీరోకి వచ్చింది.ఇంతకు ఆ హీరో ఎవరో కాదు మహేష్ బాబు.

మహేష్ బాబు కొన్ని సినిమాలలో వాయిస్ ఓవర్ చేసిన సంగతి తెలిసిందే.గతంలో ఆచార్య సినిమాలో కూడా వాయిస్ ఓవర్ చేశాడు.

కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు.దీంతో నెటిజన్లు మహేష్ బాబు వల్లే సినిమా డిజాస్టర్ అయిందని అన్నారు.

ఇక తాజాగా మహేష్ బాబు వల్ల మరో సినిమా డిజాస్టర్ అని అంటున్నారు కొందరు ప్రేక్షకులు.

తాజాగా నాగచైతన్య నటించిన థాంక్యూ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే.ఇందులో నాగచైతన్య మహేష్ బాబు అభిమానిగా కనిపిస్తాడు.

దీంతో ఇందులో మహేష్ బాబు ఫోటో కనిపించడంతో ఈ సినిమా కూడా అందుకే సక్సెస్ కాలేదు అని కామెంట్లు పెడుతున్నారు.

అంటే మహేష్ బాబు వాయిస్, మహేష్ బాబు ఫోటో ఉంటే ఆ సినిమా ప్లాప్ అంటూ ఒక ముద్ర వేశారు.

మరి మహేష్ బాబు వాయిస్ ఓవర్ చేసిన జల్సా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

మరి ఈ సినిమా ఎందుకు డిజాస్టర్ కాలేదు అంటూ మహేష్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

వివాదాల నడుమ నయనతార డాక్యుమెంటరీ పై మహేష్ కామెంట్స్.. అంత నచ్చేసిందా?