బన్నీ లుక్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. పుష్పరాజ్ బాలేడంటూ?

స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు.

ఏపీలోని పలు ఏరియాల్లో ఈ సినిమా నష్టాలను మిగిల్చినా ఇతర ఏరియాల్లో మాత్రం ఈ సినిమా కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే.

పుష్ప ది రూల్ షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ కోసం బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే పుష్ప ది రూల్ కోసం బన్నీ బరువు పెరిగారని తెలుస్తోంది.బన్నీ కొత్త లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా కొత్త లుక్ లో బన్నీ ఆకట్టుకోవడం లేదని నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.

బన్నీ కొత్త లుక్ ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.మరి కొందరు నెటిజన్లు బన్నీ లుక్ క్రికెటర్ మలింగాలా ఉందని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

అయితే పుష్ప 2 సినిమాలో బన్నీ నిజంగానే ఈ విధంగా కనిపిస్తారో లేదో చూడాల్సి ఉంది.

మరోవైపు పుష్ప2 బడ్జెట్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.పుష్ప ది రైజ్ సినిమాను మించిన బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

"""/" / 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో పుష్ప ది రూల్ తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఈ వార్తల గురించి స్పందించడానికి నిర్మాతలు అస్సలు ఇష్టపడటం లేదనే సంగతి తెలిసిందే.

మరోవైపు బన్నీ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

పుష్ప ది రూల్ షూట్ మొదలైన తర్వాతే బన్నీ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ప్రకటన వెలువడుతుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

రష్మిక పాత్ర చనిపోతుందని జరిగిన ప్రచారంలో నిజం లేదని నిర్మాతలు క్లారిటీ ఇవ్వగా ఈ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉండనుందని తెలుస్తోంది.

Dasyam Vinay Bhasker : నాయకత్వానికి చాడీలు చెప్పడం కడియం నైజం..: దాస్యం వినయ్ భాస్కర్