ముసలావిడలా ఉన్నావు.. నిహారికపై దారుణంగా ట్రోల్స్.. ఏమైందంటే?
TeluguStop.com
మెగా డాటర్ నిహారికను మెగాభిమానులు ఎంతగానో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే.నిహారికకు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
కొన్ని నెలల క్రితం ఒక వివాదంలో చిక్కుకోవడం ద్వారా నిహారిక వార్తల్లో నిలిచారు.
అయితే ఆ వివాదం గురించి స్పందించడానికి నిహారిక ఇష్టపడలేదు.ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న నిహారిక సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.
పెళ్లి తర్వాత నటిగా నిహారిక బిజీ కాకపోయినా నిర్మాతగా మాత్రం కెరీర్ ను కొనసాగిస్తున్నరు.
నటిగా, హోస్ట్ గా నిహారిక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోగా తాజాగా నిహారిక షేర్ చేసిన ఫోటో గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తల దించి నవ్వుతున్న ఫోటోను నిహారిక షేర్ చేయగా కొంతమంది నెటిజన్లు ముసలావిడలా ఉన్నావంటూ నిహారికను దారుణంగా ట్రోల్ చేశారు.
నిహారిక తల పైకి ఎత్తడం లేదని ఏ ఫోటోలో కూడా నిహారికకు ముఖం చూపించుకునే ధైర్యం లేదని మరి కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
పబ్ ఘటన తర్వాత నిహారిక ఇలాంటి వివాదాలలో చిక్కుకోవడం గమనార్హం.అయితే నిహారిక ఏ ఫోటో షేర్ చేసినా ఆమెను ట్రోల్ చేస్తుండటంపై కొందరు ఫ్యాన్స్ మాత్రం తెగ ఫీలవుతున్నారు.
నెటిజన్ల కామెంట్లపై నిహారిక ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. """/"/
అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం నిహారిక కొన్నిరోజుల పాటు కామెంట్స్ ఆప్షన్ ను డిసేబుల్ చేస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు.
నిహారిక మాత్రం నెగిటివ్ కామెంట్స్ ను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.నిహారిక తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
నిహారిక రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఆమె ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.నిహారిక పలు సినిమాలలో నటించినా ఆ సినిమాలు సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.
సింగిల్ టేక్ లో బాలయ్య నటన చూసి 400 మంది చప్పట్లు కొట్టారట.. ఏం జరిగిందంటే?