ప్రియా ప్రకాష్ వారియర్ ని ఆడేసుకున్న నెటిజన్లు

ప్రియా ప్రకాష్ వారియర్.ఈ పేరు సోషల్ మీడియా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి భాగా పరిచయం.

ఒకే ఒక్క వీడియోతో రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయిన ఈ భామ ఊహించని స్థాయిలో యాడ్స్ సొంతం చేసుకొని సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది.

అయితే మొదటి సినిమాకి ఆమె అగ్రిమెంట్ ఇవడంతో అది రిలీజ్ అయ్యేంత వరకు వేరొక సినిమా చేసే అవకాశం రాలేదు.

అయితే ప్రియా నటించిన సినిమా రిలీజ్ అయిన తర్వాత అది కాస్తా ఫ్లాప్ కావడంతో ప్రియా ఇమేజ్ ఒక్కసారిగా మసకబారిపోయింది.

తాజాగా ప్రియ ప్రకాష్ తాను చేసిన పనితో నెటిజన్లకి అడ్డంగా బుక్ అయ్యింది.

ఓ బ్రాండ్‌ ప్రమోట్ చేస్తూ దిగిన ఫోటోలను ప్రియా ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసింది.

తర్వాత ఆ పోస్ట్ కు క్యాప్షన్ కూడా పెట్టింది ఆ పోస్ట్ కు ఏం క్యాప్ష న్ ఇవ్వాలో ఆ బ్రాండ్ వాళ్లు తనకు కంటెంట్ ఇచ్చారు.

ఆ కంటెంట్ ముందు టెక్స్ కంటెంట్ ఫర్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్ అని రాసి ఉంది.

ప్రియా మాత్రం సూచనలు ఇచ్చిన ఆ కంటెంట్‌ను కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది.

ప్రియా చేసిన తప్పును చూసిన నెటిజన్లు తనను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

ఏదైనా పోస్ట్ చేసేటపుడు కాస్తా చూసుకొని చేయాలని చెప్పుకొచ్చారు.

బాలయ్య రేంజ్ ఇంతలా పెరిగిందా.. అన్ని వందల కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తున్నారా?