భర్త జైల్లో ఉంటే ఇదేం పని మహాలక్ష్మి… డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నావా అంటూ భారీ ట్రోల్స్?
TeluguStop.com
తమిళ చిత్ర పరిశ్రమలో బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటిస్తూ అనంతరం పలు సినిమాలలో కూడా నటించి మెప్పించినటువంటి వారిలో నటి మహాలక్ష్మి( Mahalakshmi ) ఒకరు.
ఈమె ఇదివరకే ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక బాబు పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని తన భర్త నుంచి విడిపోయారు.
అయితే భర్త నుంచి విడిపోయినటువంటి ఈమె నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్( Ravinder Chandrasekharan ) ను వివాహం చేసుకున్నారు.
గత రెండు సంవత్సరాల క్రితం వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే మీరు వివాహ సమయంలో వీరి గురించి భారీ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి.
"""/" /
చూడటానికి కుందనపు బొమ్మలా ఉండే మహాలక్ష్మి అధిక శరీర ఖాయం కలిగినటువంటి రవీందర్ ను పెళ్లి చేసుకోవడంతో వీరి జంట గురించి ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి.
అయితే ఈ విమర్శలను వీరిద్దరు కొట్టి పారేశారు మహాలక్ష్మి మనస్ఫూర్తిగా నన్ను పెళ్లి చేసుకుందని ఆమె నా డబ్బును చూసి పెళ్లి చేసుకోలేదు అంటూ రవీందర్ కూడా ఈ వార్తలపై స్పందిస్తూ కామెంట్లు చేశారు .
అయితే తాజాగా ఓ ప్రాజెక్ట్ విషయంలో రవీందర్ తనని మోసం చేశారు అంటూ చెన్నైకి( Chennai ) చెందినటువంటి ఒక వ్యక్తి ఆయనపై కేసు వేయడంతో పోలీసులు నిర్మాత రవీందర్ ను అరెస్టు చేశారు.
"""/" /
ఈ విధంగా రవీందర్ అరెస్టు కావడంతో మహాలక్ష్మి లో ఏ మాత్రం బాధ కనిపించలేదని జైలులో ఉన్నటువంటి భర్తను బయటకు తీసుకురావడం కోసం ఈమె ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని స్పష్టంగా అర్థం అవుతుంది.
తాజాగా మహాలక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు.ఈ ఫోటో చూసినటువంటి నేటిజన్లో మహాలక్ష్మి పై దారుణమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఫోటోలో మహాలక్ష్మి చీర కట్టుకొని ఎంతో అందంగా ముస్తాబయ్యి నవ్వుతూ ఉన్నారు.
ఈ ఫోటోని ఈ సమయంలో షేర్ చేయడంతో ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నారు.ఒకవైపు భర్త అరెస్ట్ అయి జైలులో ఉంటే నువ్వు మాత్రం ఇలా నవ్వుతూ సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అదేవిధంగా మరికొందరు బహుశా ఈమె అతనిని జైలుకు పంపించిందేమో మహాలక్ష్మి కేవలం డబ్బుపై వ్యామోహంతోనే రవీందర్ ని పెళ్లి చేసుకున్నారు తప్ప తనపై ప్రేమతో కాదు అంటూ మరికొందరు పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి పూజ.. నెటిజన్ల విమర్శలపై కీర్తిభట్ రియాక్షన్ ఇదే!