ఇదేందయ్యా ఇది.. కొబ్బరి బొండం టీ అంటా.. మీరేమైనా తాగారా? వైరల్ వీడియో

ఇప్పుడు రోజువారీ జీవనశైలిలో టీ అనేది ఒక భాగం అయిపోయింది.ఉదయం లేవగానే టీ తాగడం చాలామందికి అలవాటు.

ఒక్కసారి టీ గ్లాస్ చేజిక్కితేనే రోజు మూడో నాలుగో గేర్‌లో సాగుతుంది.ప్రపంచవ్యాప్తంగా కూడా టీకి విపరీతమైన ఆదరణ ఉంది.

అందుకే గ్రీన్ టీ, బ్లాక్ టీ, మసాలా టీ, హర్బల్ టీ, లెమన్ టీ( Green Tea, Black Tea, Spiced Tea, Herbal Tea, Lemon Tea ) వంటి ఎన్నో రకాల టీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

ప్రతి ప్రాంతానికీ ప్రత్యేకమైన టీ రుచులు ఉండటమే కాదు, కొందరు కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం.

అయితే కొన్నిసార్లు ఈ ప్రయోగాలు నెటిజన్ల నుంచి ఊహించని రియాక్షన్లను తెచ్చిపెడతాయి.తాజాగా అలాంటి ఓ టీ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

తాజాగా ఒక యువతి కొబ్బరి నీటితో టీ( Tea With Coconut Water ) తయారు చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అయితే ఆ వీడియో చూసిన టీ ప్రియులు మాత్రం ఆశ్చర్యపోతున్నారు.ఓ వీడియోలో ఓ యువతి మొదట స్టవ్ మీద కట్ చేసిన బొండం పెట్టింది.

అందులోని కొబ్బరి నీటిని మరిగించి, అందులో కొంచెం చెక్కర, అల్లం కలిపింది.తర్వాత పాలను జత చేసి టీని తయారు చేసింది.

ఈ వింత ప్రయోగాన్ని చూసిన టీ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.కొబ్బరి నీటిని చల్లగా తాగితేనే ఆరోగ్యానికి మంచిదని తెలిసినప్పుడు, దాన్ని వేడి చేసి, పాలు కలిపి టీగా తయారు చేయడమేంటని మండిపడుతున్నారు.

"""/" / ఎలా కొత్త పద్ధతులు కనిపెట్టి మనిషి ప్రాణాల మీదికి తీసుకరావద్దని కొందరు కామెంట్స్ చేస్తుంటే.

మరికొందరేమో, టెంకాయ నీటిని ఇలా కూడా వాడతారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి టీ ప్రియులకు ఇది ఒక చేదు అనుభవంలా మిగిలింది.

కొత్త ప్రయోగాలు చేయడం మేనే కానీ, వాటి ద్వారా మనకు ఎంతగానో ఇష్టమైన "టీ"ని అపహాస్యం చేయకూడదని నెటిజన్లు భావిస్తున్నారు.