కీర్తిపై నెటిజెన్స్ ప్రశంసల వెల్లువ.. భోళా ఈవెంట్ లో అమ్మడి మాటలకు అంతా ఫిదా!
TeluguStop.com
మహానటి కీర్తి సురేష్ ( Keerthy Suresh )గురించి అందరికి తెలుసు.ఈమె నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ మహానటి సినిమా ద్వారానే స్టార్ డమ్ అందుకుంది.
ఇక ఇటీవలే ఈ బ్యూటీ మహేష్ బాబుతో సర్కారు వారి పాట చేసి సూపర్ హిట్ అందుకుంది.
ఈ సినిమా తర్వాత ఈ అమ్మడు ఫామ్ లోకి వచ్చింది.తన విలక్షణ నటనతో మెప్పించిన ఈ బ్యూటీ సర్కారు వారి పాట తర్వాత మళ్ళీ నానితో దసరా సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది.
"""/" /
ఇలా రెండు బ్లాక్ బస్టర్స్ తో అమ్మడు మరిన్ని అవకాశాలు అందుకుంటుంది.
ప్రజెంట్ ఈమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి.తెలుగులో భోళా శంకర్ లో నటిస్తుంది.
ఈ సినిమాలో చిరంజీవి ( Chiranjeevi )చెల్లెలు పాత్రలో ఈమె నటిస్తుండగా ఆగస్టు 11న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.
దీంతో వరుస ప్రమోషన్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు.ఇక తాజాగా భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్నో విషయాలు హైలెట్ గా నిలిచాయి.
అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీర్తి సురేష్ మాట్లాడిన స్పీచ్ అందరిని ఆకట్టు కుంటుంది.
ఈమె ఏం మాట్లాడారంటే.''భోళా శంకర్ సినిమా ప్రధానంగా అన్న చెల్లెళ్ళ ట్రాక్ మీద నడుస్తుంది.
"""/" /
అయితే సెట్ లో నిజంగానే అలాంటి ట్రాక్ నాకు డైరెక్టర్ మెహర్ ( Meher Ramesh )అన్నకు మధ్య జరిగింది.
నన్ను నమ్మి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అంటూ స్టేజ్ మీద ఈమె చెప్పుకొచ్చింది.
అన్న చెల్లెళ్ళ అనుబంధం తనకు, మెహర్ కు మధ్య నిజంగానే ఉందని చెప్పిన ఈమె చేసిన కామెంట్స్ పై నెటిజెన్స్ కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
మొత్తానికి అమ్మడు అన్న చెల్లెళ్ళ సెంటిమెంట్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.
ఈ ఇంటి చిట్కాలతో మలబద్ధకం మటాష్..!