మా వివాదంలో తప్పు ప్రకాష్ రాజ్ దా? విష్ణుదా? నెటిజన్లు ఏమన్నారంటే?

సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే ఎన్నికలు పూర్తైన తర్వాత మాత్రం ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా వ్యవహరిస్తారు.

అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫలితాలు వెలువడి ఏడు రోజులైనా వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

"""/"/ అయితే నెటిజన్లు మాత్రం ప్రకాష్ రాజ్ దే తప్పు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

విష్ణు అధ్యక్ష పదవికి ఎన్నికైన తర్వాత కూడా వివాదాలను పెద్దవి చేసే దిశగా ప్రకాష్ రాజ్ అడుగులు వేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎన్నికలు పారదర్శకంగా జరపలేదని ప్రకాష్ రాజ్ ఆరోపణలు చేస్తుండగా ఎన్నికలు జరిగిన సమయంలో ఈ విషయాలను ఎందుకు వెల్లడించలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు ఎన్నికల అధికారి బ్యాలెట్ బాక్సులను ఇంటికి తీసుకెళ్లాడనే ఆరోపణలకు సాక్ష్యాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు కూడా నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి.

ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రకాష్ రాజ్, విష్ణు అంగీకారం ప్రకారమే కొంతమంది ప్యానల్ సభ్యుల ఓట్ల లెక్కింపును తరువాత రోజుకు వాయిదా వేశామని చెబుతున్నారు.

అయితే ఆ కామెంట్ల గురించి మాత్రం ప్రకాష్ రాజ్ స్పందించడం లేదు. """/"/ మరోవైపు విష్ణు కూడా బైలాస్ మార్చాలని తీసుకున్న నిర్ణయం సరికాదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

బై లాస్ లో మార్పు దిశగా అడుగులు పడితే విమర్శలు మరింత పెరిగే ఛాన్స్ ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడైన మంచు విష్ణు వివాదాలు రాకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.

తెలుగు వారు మాత్రమే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసేలా విష్ణు నిబంధనలను మార్చనున్నారని తెలుస్తోంది.

రక్తాన్ని శుద్ధి చేసే ఉత్తమ జ్యూస్ ఇది.. వారానికి ఒక్కసారి తీసుకున్న అద్భుత లాభాలు మీ సొంతం!