కొంచెమైనా బుద్ధుందా…. పూజకు వెళ్తూ ఈ బట్టలేంటి.. నటిపై ఫైర్ అవుతున్న నెటిజన్స్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటి దిశ పటాని ( Disha Patani ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈమె సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించుకోవడం కన్నా సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోషూట్లతో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు.

ఇక సెలబ్రిటీల అన్న తర్వాత ఇలాంటి గ్లామర్ షో ( Glamor Show )చేస్తూ రచ్చ చేయడం సర్వసాధారణం అలా చేస్తేనే వారికి సినిమా అవకాశాలు వస్తాయని ఇదివరకే ఎంతోమంది హీరోయిన్స్ ఈ విషయం గురించి బహిరంగంగా తెలియజేశారు.

"""/" / ఇకపోతే తాజాగా నటి దిశ పటాని తన వస్త్రధారణ కారణంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నేటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు.

తాజాగా ఈమె వారణాసి లోని ప్రసిద్ధ దశాశ్వమేధ ఘాట్ లో గంగా హారతి ( Ganga Harathi )లో పాల్గొన్నారు.

ఇక్కడ ఈమె గంగా హారతి ఇస్తున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈమె గంగా హారతి ఇస్తూ ఉన్న నేపథ్యంలో పలువురు దృష్టి ఆమె ధరించిన డ్రెస్( Dress ) పై పడింది.

ఈ వీడియోలో దిశా క్రాప్ టాప్, ప్యాంట్ వేసుకోవడమే కాకుండా టాప్ పై ఒక స్కార్ఫ్ కూడా వేసుకున్నారు.

"""/" / ఇలా గంగా హారతి ఇస్తూ పూజ చేస్తున్న సమయంలో ఈమె క్రాప్ టాప్ ధరించడంతో పలువురు ఈ విషయంపై ఈమెను సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.

అసలు కొంచమైనా బుద్ధుందా పూజకు వెళ్లేటప్పుడు ఎలాంటి దుస్తులు ధరించాలో కూడా తెలియదా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు పూజలో క్రాప్ టాప్ ధరించడం ఏంటి.

గుడికి వెళ్లేటప్పుడు సాంప్రదాయ దుస్తులను ధరించాలని తెలియదా అంటూ తీవ్రస్థాయిలో ఈమెపై మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు.

మోక్షజ్ఞ ఎంట్రీకి ఈ సంవత్సరంలో అయిన మోక్షం లభిస్తుందా..?