వైరల్ వీడియో : ఆకలి బాధతో కాకి చేసిన పనికి నెటిజన్లు ఫిదా ..!
TeluguStop.com
కరోనా అందరి జీవితాలను తలకిందులు చేసేసింది.చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో కొన్ని కుటుంబాలు అనాథలయ్యాయి.ఆర్థిక బాధలతో ఇంకొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆకలికి అల్లాడే పరిస్తితి వచ్చింది.ఈ భూమ్మీద అనేక జంతువులు తమ ఆకలిని తీర్చుకోవడానికి ఇబ్బందులు పడ్డాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ పక్షి ఆకలి కోసం పోరాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మనుషుల్లాగానే జంతువులకు, పక్షులకు తెలివితేటలు ఉంటాయి.వాటికి ఆలోచనలు కూడా ఉంటాయి.
అవి కొన్ని సార్లు అయితే మనుషుల మాదిరిగానే ఆలోచిస్తూ స్పందిస్తాయి.తాజాగా ఓ కాకికి బాగా ఆకలి వేసింది.
తన ఆకలిని తీర్చుకోవడానికి అది ఓ ప్రయత్నం చేసింది.ఆ కాకి చేసిన ప్రయత్నానికి నెటిజన్లందరూ ఫిదా అవుతున్నారు.
కాకి అలా చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.
వీడియోలో మనం చూస్తే మనకు కిందపడి ఉండే ఒక గ్లాసు కనిపిస్తుంది.ఆ కాకి గ్లాసులో ఉండే ఆహారాన్ని తీసుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేయనారంభిస్తుంది.
అలా కొంతసేపు సన్నగా ఉండే కర్ర పుల్లని తీసుకుని దాంతో ఆహారాన్ని బయటకు లాగుతుంది.
అది వచ్చినట్లే వచ్చి లోపలికి వెళ్లిపోతుంది.దానిని బయటకు రాబట్టడానికి ఆ కాకి అనేక ప్రయత్నాలు చేస్తుంది.
అలా అనేక సార్లు ప్రయత్నాలు చేసి ఆఖరికి గ్లాసులో ఉండేటటు వంటి ఆహారం కాస్త బయటకు వచ్చేస్తుంది.
"""/"/
అప్పుడు ఆ కాకి తన నోటితో ఆ ఆహారాన్ని అందుకుని తన ఆకలిని తీర్చుకుంటుంది.
ఇందులో కాకి అచ్చం మనుషుల లాగానే చేస్తుంది.ఆ కర్రను స్ట్రాగా మార్చుకుని ఆహారాన్ని అందుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రస్తుతంం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.కాకి తెలివికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
జక్కన్న సినిమాలకు లాజిక్ అవసరం లేదట.. కరణ్ జోహార్ క్రేజీ కామెంట్స్ వైరల్!