కూతురి వయస్సు ఉన్న హీరోయిన్ తో చిరంజీవి, బాలయ్య రొమాన్స్.. నెటిజన్లు అలా కామెంట్ చేస్తూ?

ఈ మధ్య కాలంలో సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్ల ఎంపిక విషయంలో దర్శకనిర్మాతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే సంగతి తెలిసిందే.

కొందరు స్టార్ హీరోయిన్లు సీనియర్ హీరోలకు జోడీలుగా నటించడానికి ఓకే చెబుతున్నా ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తుండటం గమనార్హం.

బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.

చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా ఎంపిక కావడం గమనార్హం.

అయితే చిరంజీవి, బాలయ్యలకు జోడీగా శృతి హాసన్ నటించడంపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

శృతి హాసన్ ఇతర హీరోయిన్లలా సాధారణ హీరోయిన్ కాదని కమల్ కూతురు అని గుర్తుంచుకోవాలని నెటిజన్లు చెబుతున్నారు.

చిరంజీవి, బాలయ్య జనరేషన్ కు చెందిన నటుడు కమల్ హాసన్ అని ఆయన కూతురుతో చిరంజీవి, బాలయ్య నటిస్తే చూసే ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

మరోవైపు శృతి హాసన్ ఎవడు సినిమాలో చరణ్ కు జోడీగా, రేసుగుర్రం సినిమాలో బన్నీకి జోడీగా రామయ్య వస్తావయ్యా సినిమాలో తారక్ కు జోడీగా నటించారు.

"""/"/ కొడుకుతో నటించిన హీరోయిన్ తో చిరంజీవి రొమాన్స్ చేయడంపై కూడా నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.

చిరంజీవి, బాలయ్యలతో పోల్చి చూస్తే శృతి హాసన్ వయస్సులో చాలా చిన్న కావడం గమనార్హం.

"""/"/ హీరోయిన్ల ఎంపిక విషయంలో, కథల ఎంపిక విషయంలో స్టార్ హీరోలు మారాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.

కూతురి వయస్సు ఉన్న హీరోయిన్లతో కలిసి నటించడం వల్ల విమర్శలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉంటాయని ఫ్యాన్స్, నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

నెటిజన్ల నెగిటివ్ కామెంట్ల గురించి చిరంజీవి, బాలయ్య ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ నిజంగా విడిపోతున్నారా.. ఆ ప్రశ్నలకు సమాధానాలివే!