Adireddy : ఆదిపురుష్ మూవీని ప్రశంసలతో ముంచెత్తిన ఆదిరెడ్డి.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్?
TeluguStop.com
టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం ఆదిపురుష్( Adipurush ).
ఇందులో కృతి సనన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఓం రౌత్( Om Rauth ) దర్శకత్వం వహించిన సినిమా ఇది వలె జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా విడుదలైన మొదటి రోజే దాదాపు 140 కోట్ల కలెక్షన్స్ ను సాధించి రికార్డులు సృష్టించింది.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఇకపోతే ఈ సినిమా విమర్శించే వారు ఎంతమంది ఉన్నారు ఈ సినిమాకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్న వారు కూడా అంతే మంది ఉన్నారు.
ఒక వర్గం ప్రేక్షకులు కావాలని ఈ సినిమాపై నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారన్న వాదనలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.
కొంతమంది అయితే ఈ సినిమా డిజాస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కానీ ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ వార్తలను నమ్మవద్దు సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావాలంటే సినిమా చూడండి అంటూ సినిమాకు మద్దతుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కొంతమంది అయితే ఏకంగా ఆదిపురుష్ డిజాస్టర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు.ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్స్( Prabhas ) కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నాయి.
"""/" /
సినిమా బాలేదన్నందుకు ఒక ప్రేక్షకుడ్ని థియేటర్ దగ్గరే కుక్కని కొట్టినట్టు కొట్టిన వీడియో వైరల్ అవుతూనే ఉంది.
ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్.ప్రముఖ యూట్యూబర్ ఆదిరెడ్డి( YouTuber Adi Reddy ).
ఆదిపురుష్ మూవీ రివ్యూ చెప్పారు.ఈ సందర్భంగా ఆ వీడియోలో ఆదిరెడ్డి మాట్లాడుతూ.
ఆదిపురుష్ సినిమాకి వెళ్లి వచ్చాను.నిన్న రాత్రి నుంచే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వింటున్నాను.
నేను భారీ అంచనాలు పెట్టుకుని సినిమాకి వెళ్లాను.నాకు ఏం అనిపించిందంటే.
సినిమా బాగుంది.హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్లిన నాకే సినిమా నచ్చింది.
వీఎఫ్ఎక్స్ ఇంకొంచెం బాగుంటే మంచిదనిపించింది.అదొక్కటే మైనస్.
ప్రభాస్ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ అనిపించింది.డైరెక్షన్ చాలా బాగుంది.
"""/" /
రామాయణాన్ని లిమిట్స్ క్రాస్ చేయకుండా ఎంత వరకూ చూపించాలో అంతవరకే చూపించారు.
ప్రభాస్ ఫ్యాన్స్‌కి కావాల్సిన ఎలివేషన్స్ కూడా ఉన్నాయి.మ్యూజిక్ అయితే ప్రాణం పెట్టి చేసినట్టు ఉంది.
మ్యూజిక్ వచ్చిన ప్రతిసారి.ఎక్కడో స్వర్గంలో తేలినట్టు అనిపిస్తుంది.
సినిమా చాలా బాగుంది.ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే సినిమా ఇది.
చాలా రోజుల తరువాత దేవుడు సినిమా వచ్చింది.దయచేసి నెగిటివ్ రివ్యూలు చెప్పే వెధవల్ని నమ్మకుండా ఫ్యామిలితో ఆదిపురుష్ సినిమాని చూడచ్చు అని తెలిపాడు ఆది రెడ్డి.
ఆదిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన పలువురు నేటిజన్స్ ఆదిరెడ్డికి మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా ఇంకొందరు ఏ సినిమా చూసావా బ్రో, సినిమా అసలు ఏమైనా బాగుందా అంటూ కామెంట్ చేస్తున్నారు.
అసలు నీకు రామాయణం తెలుసా బ్రో, సినిమా ఎలా ఉందో కళ్లు పెట్టి చూస్తే తెలుస్తుంది.
నిజాలు చెప్పరా సామీ ముందు వెళ్లి రామాయణం గురించి తెలుసుకుని అప్పుడు రివ్యూలు చెప్పు అంటూ ఒక రేంజ్‌లో ఆదిరెడ్డిని ఏకిపారేస్తున్నారు నెటిజన్లు.
విద్యార్థినికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిన ఉపాధ్యాయుడిని చితకబాదిన తల్లిదండ్రులు