మీ నాన్న పరువు తీయకు తనని చూసి నేర్చుకో… ఆర్యన్ ఖాన్ పై నెటిజన్స్ ఫైర్!

సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఎక్కడైతే సందడి చేస్తుంటారో అక్కడ మీడియా వాళ్ళు ఉండడం సర్వసాధారణం ఇలా సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే సెలబ్రిటీలు సైతం మీడియా వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.

సెలబ్రిటీలు మీడియాని ఏమాత్రం ఇగ్నోర్ చేసిన భారీగా వారిని ట్రోల్ చేస్తూ వారిని ఓ ఆట ఆడుకుంటారనే విషయం సెలబ్రిటీలకు తెలుసు కనుక వారికి ఓపిక లేకపోయినా ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా మీడియాకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు.

ఇకపోతే మరికొందరు మాత్రం మీడియాని పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు.ఇలా మీడియాని ఇగ్నోర్ చేసిన వారు దారుణమైన ట్రోలింగ్స్ ఎదుర్కొంటూ ఉంటారు.

ప్రస్తుతం ఇలాంటి ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నారు ప్రముఖ నటుడు షారుఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్.

ఈయన ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు కానీ ఈయన మాత్రం బాగా ఫేమస్ అయ్యారు.

"""/" / గత ఏడాది క్రితం ఈయన ముంబై డ్రగ్స్ కేసులో భాగంగా అరెస్టు కావడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

ఇలా ఆర్యన్ ఖాన్ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.ఇకపోతే తాజాగా ఈయన ఓ కార్యక్రమంలో భాగంగా బయటకు వచ్చారు.

అయితే మీడియా వాళ్ళు తనని ఒక్క ఫోటో అని అడిగినప్పటికీ తను మాత్రం మీడియాని ఏమాత్రం పట్టించుకోకుండా యాటిట్యూడ్ చూపించారు.

"""/" / దీంతో మీడియా ఈయన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా నెటిజన్స్ ఆర్యన్ ఖాన్ పై భారీగా ట్రోల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మరికొందరు నువ్వు యాటిట్యూడ్ చూపించకు.ఇలా యాటిట్యూడ్ చూపిస్తూ మీ నాన్న పరువు తీయొద్దు మీ నాన్నని చూసి నేర్చుకో అంటూ కొందరు ఆర్యన్ ఖాన్ పై ఫైర్ అవుతున్నారు.