చెప్పులు వేసుకొని బతుకమ్మ సంబరాల్లో నటి సమీరా…ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

దసరా వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున పండగ వాతావరణం నెలకొంటుంది.

ఆంధ్రప్రదేశ్ లో దేవి నవరాత్రుల వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోగా తెలంగాణలో మాత్రం బతుకమ్మ ( Bathukamma ) వేడుకలను కన్నుల పండుగగా జరుపుకుంటారు.

తొమ్మిది రోజుల పాటు వివిధ రకాలుగా బతుకమ్మను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మహిళలందరూ బతుకమ్మ చుట్టు ఆటపాటలతో డాన్సులు వేస్తూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా బతుకమ్మ వేడుకలలో భాగంగా కేవలం తెలంగాణ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా బాగా నవ్వుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు బతుకమ్మ వేడుకలను జరుపుకుంటూ అందుకు సంబంధించినటువంటి వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే నటి సమీరా ( Sameera ) గురించి అందరికీ తెలిసిందే సీనియర్ నటి సనా కోడలు సమీరా గురించి అందరికీ సుపరిచితమే సనా( Sana ) క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించ మెప్పించారు.

అయితే ప్రస్తుతం ఈమె బుల్లితెర సీరియల్స్ లో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక సనా కోడలుగా నటి సమీరా అందరికీ ఎంతో సుపరిచితమే ఒకప్పుడు వరుస సీరియల్స్ లో నటిస్తున్నటువంటి ఈమె ప్రస్తుతం సీరియల్స్ కాస్త దూరంగా ఉంటూ బాబు ఆలనా పాలన చూసుకుంటూ బిజీగా ఉన్నారు.

"""/" / ఇక ఈమె సీరియల్స్ కు చాలా దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం తనకు సంబంధించినటువంటి అన్ని వీడియోలను అభిమానులతో పంచుకుంటారు.

ఇలా తన కుమారుడికి అలాగే తన ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయాలను అభిమానులతో షేర్ చేసుకునే ఈమె తాజాగా బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ వీడియో పై పలువురు నైటిజన్స్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి సమీరా ముస్లిం అయినప్పటికీ తెలుగు పండుగలను కూడా ఎంతో ఘనంగా జరుపుకోవడంతో చాలామంది ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

"""/" / ముస్లిం అయిన మీరు ఇలా బతుకమ్మ వేడుకలలో మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది సమీరా గారు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ఇలా బతుకమ్మ ఆటలు పాల్గొనడం బాగుంది కానీ చెప్పులు వదిలేసి బతుకమ్మ వేడుకలలో పాల్గొని ఉంటే బాగుండేది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇలా బతుకమ్మ చుట్టు ఆటపాటలతో సందడి చేసే సమయంలో సమీరా చొప్పులు వేసుకోవడంతోనే కొందరు ఈ విషయం గురించి కామెంట్ చేస్తూ ఆమెపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఈమె కులమతాలకు అతీతంగా బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నప్పటికీ నెటిజన్ల ఆగ్రహానికి మాత్రం గురవుతున్నారు.

ప్రస్తుతం ఈమె బతుకమ్మ వేడుకకు సంబంధించినటువంటి వీడియో వైరల్ గా మారింది.అయితే ఈ వీడియోలో ఈమె తన కుమారుడిని ఎత్తుకొని మరి డాన్స్ చేస్తూ ఉండడం అందరిని ఆకట్టుకుంది.

ఏ దర్శకుడైనా మా నాన్నతో సమానం.. స్టార్ హీరో బాలయ్య కామెంట్స్ కు ఫిదా అవ్వాల్సిందే!