బాలీవుడ్ నటి అంకిత పై నెటిజెన్స్ ఫైర్…! అసలు విషయమేమిటంటే..?!
TeluguStop.com
తాజాగా బాలీవుడ్ నటి అంకిత తన అధికార ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తనకు సంబంధించిన ఫోటోని షేర్ చేయడంతో ఆ ఫోటోకి సంబంధించి నెటిజెన్స్ ఆమెపై సీరియస్ అవుతున్నారు.
అసలు ఎందుకు ఇలా జరిగిందంటే.నటి అంకిత తల్లి ఆమెకు కాస్త డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేశారని తెలుపుతూ.
అందుకు సంబంధించి సదరు ఫోటోను షేర్ చేసింది.అయితే ఇంత వరకు బాగానే ఉన్నా ఆ ఫోటో లో అంకిత వేసుకున్న డ్రస్సు పై నెటిజన్స్ ఫైర్ అయ్యారు.
ఇకపోతే తన హెయిర్ స్టైల్ చూపిస్తూ షేర్ చేసిన ఫోటోలో అంకిత ఒక టీ షర్ట్, అలాగే పసుపు ఎరుపు వర్ణం లో ఉన్న పైజామా వేసుకొని కనపడింది.
అయితే ఆమె ధరించిన పైజామా పై ఓం అని రాసి ఉంది.ఇక అంతే ఈ ఫోటోను చూసిన కొందరు నెటిజెన్స్ ఆమెపై తెగ ఫైర్ అయిపోయారు.
కొందరు నెటిజెన్స్ " మేడం మీ మీద నాకు ఎటువంటి శత్రుత్వం లేదు.
నేను మిమ్మల్ని ఆటపట్టించడం అనుకోవట్లేదు.మీరు ధరించిన పైజామా పై ఓం అని రాసి ఉంది, మేము ఓంకారాన్ని సృష్టికి చిహ్నంగా భావిస్తాము.
దీనిని మీరు పైజామా రూపంలో ధరించారు అని.ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను " అంటూ కామెంట్ చేశారు.
ఇక మరొక నెటిజన్ అయితే ఈశ్వరుని పేరును మీరు కాళ్ల దగ్గరగా ఉంచడం చాలా తప్పు అంటూ కామెంట్ చేశారు.
అయితే ఈ కామెంట్స్ కు అంకిత ఎటువంటి రిప్లై ఇంకా ఇవ్వలేదు.చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో.
యూదు విద్యార్ధుల అవస్థలు.. భయంతో మతాన్ని దాచిపెడుతున్నారు .. అమెరికాలో వెలుగులోకి సంచలన సర్వే