నువ్వు అసలు మనిషివేనా రష్మిక… బండ బూతులు తిడుతున్న నేటిజన్స్… ఏమైందంటే?
TeluguStop.com
నేషనల్ క్రష్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మిక ( Rashmika ) ప్రస్తుతం భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటుంది.
ఇటీవల పుష్ప 2 ( Puahpa 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న రష్మిక తన వ్యక్తిగత జీవితాన్ని మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంది.
దీంతో నేటిజన్స్ భారీ స్థాయిలో ఈమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.పుష్ప సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రష్మిక ఈ సినిమా హీరో ప్రస్తుతం వివాదాలలో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అభిమాని మరణించడంతో ఆ వివాదం అల్లు అర్జున్( Allu Arjun ) మెడకు చుట్టుకుంది.
"""/" /
ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రతిక్షణం టెన్షన్ లో అల్లు అర్జున్ ఫ్యామిలీ ఉన్నారు.
ఇక త్వరలోనే న్యూ ఇయర్, సంక్రాంతి వంటి పెద్ద పండుగలు వస్తున్న ఈ ఇంట్లో మాత్రం సంతోషం లేదని చెప్పాలి.
వరుసగా పోలీసు విచారణ, ప్రెస్ మీట్ అంటూ అల్లు అర్జున్ ఈ కేసు విషయంలో ఎంతో టెన్షన్ గా గడుపుతున్నారు.
ఇలా అల్లు అర్జున్ ప్రతిక్షణం ఎంతో టెన్షన్ పడుతూ ఉండగా ఈ సినిమాలో నటించిన రష్మిక మందన్న ఈ ఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ వెంట సంధ్య థియేటర్లోనే ఉన్నారు.
కానీ ఈమెను మాత్రం ఎవరు ప్రశ్నించలేదు. """/" /
ఇక తనకు లైఫ్ ఇచ్చిన హీరో ప్రస్తుతం ఇబ్బందులలో ఉంటే ఈమె మాత్రం ఏదో స్పందించాలంటే స్పందించాలి అనే ధోరణిలో ఒక ట్వీట్ వేసి సైలెంట్ అయ్యారు.
అంతేకాకుండా తన రూమర్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి పెద్ద ఎత్తున క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఇటీవల ఈమె విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ఇద్దరు కూడా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు.
దీంతో వీరిద్దరూ కలిసే ముంబైకి వెళ్లారని ముంబైలో హీరో రణబీర్ కపూర్ ఇచ్చే పార్టీలో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.
దీంతో నేటిజన్స్ భారీ స్థాయిలో మండిపడుతున్నారు.అసలు నువ్వు మనిషివేనా? కొంచమైనా మానవత్వం ఉందా? నీకు లైఫ్ ఇచ్చిన హీరో ఇబ్బందులలో ఉంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా ? అంటూ అల్లు అర్జున్ అభిమానులు అలాగే పలువురు నెటిజన్స్ రష్మిక తీరుపై విమర్శలు చేస్తున్నారు.
జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలా.. అయితే ఇలా చేయండి!