కియారాపై ఫైర్ అయిన నెటిజన్లు.. వృద్ధుడితో అలా చేయించడంతో..?

తెలుగులో నటించింది రెండు సినిమాలే అయినా కియారా అద్వానీకి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్, పాపులారిటీ అంతాఇంతా కాదు.

తెలుగులోని స్టార్ హీరోల ప్రాజెక్టుల్లో కియారా అద్వానీకి కొత్త సినిమా ఆఫర్లు వస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుండగా అధికారిక ప్రకటన రావాలంటే మాత్రం కొన్నిరోజులు ఆగాల్సిందే.

అయితే తాజాగా కియారా చేసిన ఒక పనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.

తెలుగుతో పాటు హిందీలో కియారా అద్వానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.

బికినీలో ఫోటోలు దిగుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కియారా అద్వానీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.

కియారా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉన్నట్టు గత కొంతకాలం నుంచి వార్తలు ప్రచారంలో వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా కియారా సిద్దార్థ్ మల్హోత్రా ఇంటికి వెళ్లారు. """/"/ ఆ సమయంలో కియారా అద్వానీ వచ్చిన కారు డోర్ ను వృద్ధుడు తెరిచాడు.

దీంతో కియారా సొంతంగా కారు డోర్ ను కూడా తెరవలేరా ? అని విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా నెటిజన్లు కియారాపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతుండటం గమనార్హం.

సెలబ్రిటీ అయినంత మాత్రాన గ్రేట్ అని ఫీలవుతున్నారా అంటూ నెటిజన్లు కియారా అద్వానీని ప్రశ్నిస్తున్నారు.

"""/"/ వయస్సులో పెద్ద వ్యక్తితో కారు డోర్ తీయించుకోవడం కరెక్టేనా ? అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

నెటిజన్లు ఫైర్ అవుతున్న నేపథ్యంలో కియారా అద్వానీ స్పందించి వివరణ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

శంకర్ చరణ్ సినిమాతో పాటు ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాకు హీరోయిన్ గా కియారా అద్వానీ పేరు వినిపిస్తుండటం గమనార్హం.

అయితే ఏ హీరో సినిమాలో కియారా అద్వానీ నటిస్తారో తెలియాలంటే అధికారికంగా ప్రకటనలు వచ్చే వరకు ఆగాల్సిందే.

పవన్ కళ్యాణ్ రాత్రిపూట అలాంటి సినిమాలు చూస్తారా… ఇలాంటి అలవాటు కూడా ఉందా?