ఆంటీ లావవ్వుతావంటూ అనసూయకు కామెంట్.. మళ్ళీ కేస్ పెడుతుందంటూ నెటిజన్ రిప్లై?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం యాంకర్, నటిగా ఓ రేంజ్ లో పరుగులు తీస్తున్న అనసూయ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.
టాలీవుడ్ బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఎదిగి మంచి గుర్తింపు అందుకుంది.తన మాటలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ముఖ్యంగా జబర్దస్త్ లో తను వేసిన డాన్సులకు మాత్రం కుర్రాళ్లను తన వైపుకు మలుపుకుంది.
అనసూయ ఓ న్యూస్ ఛానల్ లో యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది.
ఆ తర్వాత వెండితెరపై పలు సైడ్ క్యారెక్టర్లలో నటించింది.అయితే యాంకర్ గా ఈటీవీ జబర్దస్త్ తో బుల్లితెరపై అడుగుపెట్టాక ఇక్కడి నుంచి ఈమె తలరాత మొత్తం మారింది.
ఈ షోతో అనసూయకు మంచి గుర్తింపు వచ్చింది. """/"/
అంతేకాకుండా మంచి అభిమానం కూడా సొంతం చేసుకుంది.
ఇందులో తన మాటలతో, డాన్సులతో అందర్నీ ఫిదా చేసింది.ఇక ఈ షో ద్వారానే ఈమెకు వెండితెరపై అవకాశాలు కూడా వచ్చాయి.
చాలా వరకు మంచి మంచి గుర్తింపు ఉన్న పాత్రలలో నటించింది.అంతేకాకుండా కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా అలరించింది.
ఇక జబర్దస్త్ కు దూరమైన మరో ఛానల్ లో యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆమె వెండితెరపై కూడా బాగా బిజీగా ఉంది.ఇదే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా చేసింది అనసూయ.
గత తేడాది విడుదలైన పాన్ ఇండియా మూవీ పుష్పలో నెగిటివ్ రోల్ లో చేసి మరింత పేరు సంపాదించుకుంది.
"""/"/
మొత్తానికి అనసూయ బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా తను ఏంటో నిరూపించుకుంది.
ఈమెకు పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.అయినా కూడా అనసూయ అందం లో ఎటువంటి మార్పు లేదు.
ఇప్పటికీ అదే గ్లామర్.ఈమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, డాన్స్ వీడియోలను పంచుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటంతో.
అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో కూడా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.ఈమెకు బాగా నెగిటివ్ ట్రోల్స్ కూడా వస్తూ ఉంటాయి.
గతంలో వీటిని అస్సలు పట్టించుకపోయేది అనసూయ.ఇక ఈ మధ్య ఈమెపై మరింత ట్రోల్స్ ఎక్కువయ్యాయి.
ఆంటీ అంటూ ఓ రేంజ్ లో ఈమెను బాగా ఆడుకుంటున్నారు.దీంతో అనసూయ ఇప్పుడు మాత్రం ట్రోలర్స్ ను వదలట్లేదు.
ఇటీవలే తనపై ట్రోల్ చేసిన వ్యక్తిని కూడా అరెస్టు చేయించి బాగా రచ్చ చేసింది.
"""/"/
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.
ఈరోజు క్రిస్మస్ సందర్భంగా కేకు తింటూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. అయితే ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.
దీంతో ఓ నెటిజన్.ఆంటీ లావు అవుతారు మరి చూసుకోండి అంటూ కామెంట్ పెట్టగా వెంటనే మరో నెటిజన్.
బ్రో ఆంటీ అనకు మళ్ళీ కేసు పెట్టిన పెట్టుద్ది అంటూ రిప్లై ఇచ్చారు.
దీంతో మళ్లీ ఆ నెటిజన్.ఆంటీ ని ఆంటీ అనుకుంటే సొసైటీ ఫీల్ అవుతుంది కదా బ్రో.
చూసుకోవాలి కదా మనమే అంటూ కామెంట్ పెట్టారు.ఇక ప్రస్తుతం ఆ కామెంట్లు బాగా వైరల్ అవుతుంది.
మరి దీనికి అనసూయ ఏమని స్పందిస్తుందో చూడాలి.
రీల్ చేసి ఫేమస్ అవుదామనుకున్నాడు.. కానీ, పోలీసులు దెబ్బకు దిమ్మ తిరిగిందిగా