కుమారి ఆంటీ విషయంలో రేవంత్ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్న నెటిజన్లు.. ఆమె కూడా ఆ విషయాల్లో మారాలంటూ?

గత 24 గంటల్లో సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో, న్యూస్ ఛానెల్స్ లో, ప్రముఖ పత్రికల్లో కుమారి ఆంటీ( Kumari Aunty ) పేరు మారుమ్రోగింది.

ఆమె ఫుడ్ స్టాల్ ను తీసేయాలని పోలీసులు చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.చిరు వ్యాపారి కుమారి ఆంటీ కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేలా ఈ నిర్ణయం ఉందని వార్తలు వినిపించాయి.

అయితే ఈ ఘటన రేవంత్ రెడ్డి ( Revanth Reddy )దృష్టికి రావడంతో కుమారి ఆంటీకి ఊరట లభించింది.

ఆమె మునుపటిలా వ్యాపారాన్ని నిర్వహించుకునే అవకాశం అయితే ఉంది.అయితే అదే సమయంలో పోలీసులు చెప్పిన సూచనలను సైతం ఆమె పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ట్రాఫిక్ కు అంతరాయం కాకుండా, వంటకాలు తినడానికి వచ్చిన వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఆమె జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

"""/" / 50,000 రూపాయల విలువైన ఆహారం ఫుడ్ ట్రక్ లో ఉందని కుమారి ఆంటీ వెల్లడించారు.

యూట్యూబర్ల ప్రచారానికి ఆమె కొంతకాలం దూరంగా ఉంటే మంచిదని ఆమె అన్నారు.2011 నుంచి మేము ఫుడ్ పెడుతున్నామని కుమారి ఆంటీ వెల్లడించారు.

50,000 రూపాయల ఫుడ్ అంటే నేను ఎన్నోరోజులు కష్టం చేయాల్సి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.

మరోవైపు రేవంత్ రెడ్డి మంచి మనస్సును నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. """/" / 400 మంది కోసం ఫుడ్ తీసుకెళ్తున్నానని ఆమె అన్నారు.

కుమారి ఆంటీ అమాయకురాలని ఆమెను ఇబ్బంది పెట్టవదని నెటిజన్లు ఫీలవుతున్నారు.రేవంత్ రెడ్డి త్వరలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ లో ఫుడ్ టేస్ట్ చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.

కుమారి ఆంటీ వాహనం ఇంకా ఆమెకు అందాల్సి ఉందని సమాచారం అందుతోంది.కుమారి ఆంటీ కష్టాలు తీరాలని రాబోయే రోజుల్లో ఆమె సొంతంగా హోటల్స్ ను ఏర్పాటు చేయాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

దగ్గును కేవలం 2 రోజుల్లో తరిమికొట్టే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!