ఆస్కార్ ఇస్తే చరణ్, తారక్ లకు ఇవ్వండి.. లేకపోతే ఇద్దరు హీరోలకు వద్దంటూ?

2022 టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు అటు చరణ్ ఇటు తారక్ అభిమానులకు ఎంతగానో నచ్చింది.

ఈ ఇద్దరు హీరోలలో ఏ హీరోను తక్కువ చేయలేము.ఆస్కార్ నామినేషన్స్ లో ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోల పేర్లు జోరుగా వినిపిస్తున్నాయనే సంగతి తెలిసిందే.

అయితే కొంతమంది ఫ్యాన్స్ ఆస్కార్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఆస్కార్ ఇస్తే చరణ్, తారక్ ఇద్దరికీ ఇవ్వాలని లేకపోతే ఎవరికీ ఇవ్వవద్దని చెబుతున్నారు.

ఇద్దరిలో ఒకరికి వచ్చి మరొకరికి రాకపోతే ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఫీలవుతామని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ ఇద్దరు హీరోలలో ఎవరికి వచ్చినా తమకు సంతోషమేనని మరి కొందరు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఇద్దరు హీరోలలో ఎవరికి ఆస్కార్ వస్తుందో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే.

మరోవైపు చరణ్, తారక్ ప్రస్తుతం తమ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టారు.

చరణ్ శంకర్ డైరెక్షన్ లో తారక్ కొరటాల శివ డైరెక్షన్ లో భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో నటించనున్నారు.

"""/"/ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనున్నాయి.తారక్ త్వరలోనే కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననున్నారు.

కళ్యాణ్ రామ్, సుధాకర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

యాక్షన్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని అందరూ భావిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై ఆరు నెలలవుతున్నా ఈ సినిమా గురించి జోరుగా చర్చ జరుగుతోంది.

టాలీవుడ్ తీరు పై రేవంత్ ఆగ్రహం ? ఏం చేయబోతున్నారు