అవినాష్ చేస్తున్న పనికి ఫైరవుతున్న నెటిజన్స్.. ఈ సమయంలో అలా చేయడం అవసరమా అంటూ?

సోషల్ మీడియా ఉందని జనాలు ప్రతి ఒక్క విషయాన్ని అందులోనే పంచుకుంటున్నారు.ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని జరిగే విషయాలు కాకుండా పర్సనల్ విషయాలు కూడా పంచుకుంటున్నారు.

ఇలా సామాన్యులే కాదు ఖాళీ సమయం దొరికితే సెలబ్రెటీలు( Celebrities ) కూడా యూట్యూబ్ లలో బాగా హడావుడి చేస్తున్నారు.

ప్రతి చిన్న విషయాన్ని వీడియో ద్వారా బాగా లాగదీస్తున్నారు.అక్కడ ఉన్నది కొంచెం అయితే చూపించేది చాలా ఎక్కువగా ఉంటుంది.

ఇక కొందరు అవసరానికి మాత్రమే వాడుకుంటుంటే మరి కొంతమంది మాత్రం ఇంట్లో గుండు పిన్ను కింద పడ్డ విషయాన్ని కూడా చెప్పేస్తున్నారు.

అయితే ఇది చెప్పటానికి వాళ్లకు ఎటువంటి మొహమాటం లేకున్నా కూడా చూసే వారు మాత్రం బాగా చీదరించుకుంటూ ఉంటారు.

అంతేకాదు కొన్నిసార్లు పక్కన వ్యక్తి బాధల్లో ఉన్న కూడా ఆ బాధ నుండి ఓదార్చకుండా ఆ బాధ గురించి చెప్పడానికి కూడా యూట్యూబ్ వ్లాగ్స్ బాగా చేస్తున్నారు.

"""/" / ఇప్పుడు బుల్లితెర కమెడియన్ ముక్కు అవినాష్( Comedian Mukku Avinash ) కూడా అలాగే చేయడంతో ఆయనపై జనాలు మండిపడుతున్నారు.

ఇంతకు అతడు ఏం చేశాడో అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.జబర్దస్త్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై మంచి కమెడియన్ గా పేరు సంపాదించుకున్నాడు.

అంతేకాకుండా ఎంతో కొంత అభిమానం కూడా సంపాదించుకున్నాడు.వెండితెరపై కొన్ని సినిమాల్లో కూడా నటించాడు.

ఒక గతంలో బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకోగా అందులో బాగా అతి చేశాడు.

ఒక బిగ్ బాస్( Big Boss ) తర్వాత పలు షోలల్లో పాల్గొని బాగా సందడి చేస్తున్నాడు.

అంతేకాకుండా గతంలో అనుజా( Anuja ) అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా పెళ్లి తర్వాత తనతో కలిసి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారాడు.

బాగా రీల్స్ చేయడమే కాకుండా యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసుకుని ప్రతి ఒక్క విషయాన్ని పంచుకున్నాడు.

"""/" / మధ్యలో కొన్ని సార్లు ప్రాంక్ వీడియోలు కూడా చేశాడు.ఇక ఏ చిన్న విషయానికైనా వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు.

దీంతో కొన్ని కొన్ని సార్లు అతడు చేసే అతి పట్ల జనాలు బాగా విమర్శలు చేస్తూ ఉంటారు.

కానీ వాటిని అస్సలు పట్టించుకోడు.అయితే ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా తన తల్లి అనారోగ్య సమస్యతో బాధపడుతూ హాస్పిటల్లో జాయిన్ అయిన విషయాన్ని కూడా యూట్యూబ్ ద్వారా వీడియో చేస్తూ షేర్ చేసుకున్నాడు.

ఆ వీడియోలో తన తల్లి హెల్త్ ప్రాబ్లం గురించి చెప్పటం, నేనున్నాను అంటూ ధైర్యం ఇవ్వటం అలా కొన్ని విషయాలు చెప్పటంతో ఆవిడ తన పరిస్థితి చాలా దీనంగా ఉందేమో అని భయపడుతూ ఎమోషనల్ అవుతూ కనిపించింది.

అయితే ఈ వీడియో చూసిన వారంతా తను త్వరగా కోలుకోవాలని కోరగా.కొందరు మాత్రం ఈ సమయంలో వ్లాగ్స్ తీయడం అవసరమా.

తనకున్న సమస్య గురించి తన ముందే చెబితే తన ఎంత బాధ పడుతుంది.

వీడియో తీయకుండా కూడా ఆమెకు ధైర్యం ఇవ్వచ్చు.తను అలా బాధపడుతుంటే వీడియోస్ తీయడం కరెక్ట్ కాదు అంటూ ఫైర్ అవుతున్నారు.

భర్తకి మగతనం లేదంటూ భార్య పంచాయితీ.. అవమానంతో ఏం చేశాడంటే!