ఏంటీ బిగ్ బీ... ఆ పేరు పలకడానికి కూడా ధైర్యం లేదా... భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్!
TeluguStop.com
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూ ఇప్పటికీ ఎన్నో సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఈ విధంగా గత కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు నెటిజన్ల నుంచి చేదు అనుభవం ఎదురైంది.
సోషల్ మీడియా వేదికగా అమితాబ్ బచ్చన్ ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఈ క్రమంలోనే నెటిజన్లు ఈయన పై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు.ది కాశ్మీర్ ఫైల్స్.
ఒక చిన్న సినిమాగా అతి తక్కువ థియేటర్లలో విడుదల అయి బాక్సాఫీసు వద్ద ప్రబంజనాలను సృష్టిస్తూ.
ప్రేక్షకుల డిమాండ్ మేరకు అత్యధిక థియేటర్లలో విడుదల అయి బాక్సాఫీసు వద్ద 100 కోట్ల క్లబ్ లో చేరడానికి ప్రయత్నిస్తున్న ఈ సినిమా గురించి ఇప్పటికే ఎంతోమంది మాట్లాడుతూ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ చెప్పుకొచ్చారు.
"""/"/
ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్ సైతం ఈ సినిమా గురించి ఒక ట్వీట్ చేశారు.
గతంలో మనకు తెలియనిది ఇప్పుడు తెలుస్తోంది.అంటూ ట్వీట్ చేశారు.
అయితే ఇలా ట్వీట్ చేస్తూ సినిమా పేరు ప్రస్తావించకపోవడంతో పెద్ద ఎత్తున ఈ ట్వీట్ వైరల్ గా మారి ఎంతో మంది నెటిజన్ల ట్రోలింగ్ కు గురవుతుంది.
ఈ క్రమంలోనే ఒక నెటిజన్ స్పందిస్తూ సూటిగా సినిమా పేరు చెప్పచ్చు కదా మరి ఇంత భయం ఏంటి.
ఆ సినిమా పేరు చెప్పడానికి కూడా అంత భయపడలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Validation Check 2026-03-24 19:38:18