Anasuya : నువ్వు చూపిస్తే తప్పులేదు కానీ మేము కామెంట్ చేస్తే తప్పా… అనసూయ వీడియోపై నెటిజన్స్ ట్రోల్స్!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ ( Anasuya ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈమె బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు.
ఇప్పటికే పలు సినిమాలలో నటించినటువంటి అనసూయకు పెద్దగా గుర్తింపు రాకపోయినా రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ సినిమాలో నటించిన తర్వాత ఈమె కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు.
"""/" /
ఇలా వరుస సినిమా అవకాశాలను అందుకొని సినిమా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ బుల్లితెర కార్యక్రమాలకు ఏకంగా గుడ్ బై చెప్పారు.
ఇలా బుల్లితెరకు దూరంగా ఉన్నటువంటి ఈమె వెండితెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.
ఇలా సినిమాలలో నటిస్తూనే అనసూయ సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా లేదు.
గత కొద్దిరోజుల క్రితం తన భర్తతో కలిసి బీచ్ వెళ్లి బికినీలో పెద్ద ఎత్తున హంగామా చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా అనసూయ బికినీ ఫోటోలపై భారీగానే ట్రోల్స్ వచ్చాయి.అయితే ఈ వీడియోలను ఫోటోలను అనసూయ తరచూ సోషల్ మీడియాలో రిపీట్ చేస్తూనే ఉంది.
తాజాగా మరోసారి ఈ బికినీ వీడియోను సోషల్ మీడియా( Social Media ) వేదికగా షేర్ చేస్తూ లెట్స్ గో బ్యాక్ అంటూ అభిమానులతో ఈ వీడియోని పంచుకున్నారు.
"""/" /
ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్స్ మరోసారి ఈమెపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
షేర్ చేయడానికి మీ దగ్గర ఎలాంటి వీడియోలు లేవా ఈ ఒక్కటే ఉందా అంటూ కామెంట్ చేయగా మరి కొందరు మాత్రం ఇలాంటి వీడియోలు షేర్ చేస్తావు ఆంటీ అంటే మరి ఏడుస్తావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియోకి వచ్చే కామెంట్లు చూసి మరోసారి ఏడవక తప్పదన్న ఉద్దేశంలో నేటిజెన్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మరొక నెటిజన్ అయితే నువ్వు అన్ని చూపిస్తూ ఇలాంటి వీడియోలు షేర్ చేస్తే తప్పులేదు కానీ ఈ వీడియోలపై మేము కామెంట్లు చేస్తే మాత్రం తప్పు పడతావు అంటూ అనసూయ బోల్డ్ వీడియో స్పందిస్తూ విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు.
"""/" /
ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె పెదకాపు ( Pedakapu ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించ లేకపోయిందని చెప్పాలి.
గ్రామీణ ప్రాంతంలో జరిగే కుల రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలో అనసూయ అక్కమ్మ అనే పాత్రలో నటించారు.ఇక త్వరలోనే పుష్ప 2 ( Pushpa 2 ).
ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది ఈ సినిమాలో అనసూయ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది.