బేబమ్మపై దారుణంగా కామెంట్స్ చేసిన నెటిజన్.. చివరికి?

ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్రలో మెప్పించిన బ్యూటీ కృతి శెట్టి.తొలి సినిమాతోనే తన నటనతో వరుస అవకాశాలను కూడా అందుకుంది.

ఒక్క చూపుతోనే, ఒక్క నవ్వుతోనే కుర్రాళ్ల మతి పోగొట్టిన ఈ బ్యూటీ.మొత్తానికి అభిమానుల హృదయాల్లో ఓ స్థానాన్ని నిలుపుకుంది.

అంతే కాదండోయ్ తన అందంతో స్టార్ హీరోల మనసులను కూడా దోచుకుంది.ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో యంగ్ హీరో రామ్ నటించనున్న రాపో - 16 సినిమాల్లో నటిస్తుంది.

అంతేకాకుండా నాచురల్ స్టార్ హీరో నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవే కాకుండా సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది అనే సినిమాలో కూడా నటిస్తుంది ఈ బ్యూటీ.

ప్రస్తుతం మూడు సినిమాలలో బిజీగా ఉన్నా కృతి శెట్టి మరి రెండు సినిమాలలో కూడా అవకాశాలను అందుకుందని తెలుస్తుంది.

హీరో నిఖిల్ నటించనున్న ఓ సినిమా, రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ నటించనున్న సినిమాలో తనకు అవకాశాలు వచ్చాయని.

కానీ తాను చేయలేనని చెప్పిందని వార్తలు వినిపించగా.ఈ విషయం గురించి కృతి శెట్టి తన ట్విట్టర్ ద్వారా తెలిపింది.

"""/" / ప్రస్తుతం తను ఈ సినిమాల గురించి వస్తున్న పుకార్లు విన్నానంటూ.

ప్రస్తుతానికి మూడు సినిమాలలో సంతకం చేశానని తెలిపింది.ప్రస్తుతం తన ఏకాగ్రత మొత్తం తను ఓకే చేసిన సినిమాల పట్ల అని.

తన తర్వాత సినిమాల పై సంతకం చేసినప్పుడు వాటి వివరాలు తెలుపుతానని తెలిపింది.

ఇక ఈ పోస్ట్ కు నెటిజనులు కృతి పై పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మొదట పాఠశాల చదువులపై దృష్టి పెట్టమని కామెంట్స్ చేయగా.ప్రస్తుతం కోవిడ్ పరిస్థితిలో ఆటోమేటిక్ ప్రమోషన్స్ కారణంగా ఈజీగా పాస్ కావొచ్చని ఎగతాళి చేస్తున్నారు.

మరి ఈ కామెంట్లను కృతి ఎలా చెక్ పెడుతుందో చూడాలి.

ప్రభాస్ లేకుండానే సలార్ 2 షూటింగ్.. విడుదల అయ్యేది అప్పుడేనా?