‘మీ భార్య మాట వినకండి’ అంటూ నెటిజన్ ట్వీట్.. ఆనంద్ మహీంద్రా రిప్లై ఏంటంటే..
TeluguStop.com
మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.
అయితే తాజాగా అతను ఫన్నీగా ఒక ట్వీట్ చేశారు.తన భార్య నిద్రలేమికి ఒక చికిత్సను తనకు రికమెండ్ చేసిందని అతను అన్నారు.
ఆ చికిత్స ఏమిటంటే కంప్యూటర్, ఫోన్స్‌ను పూర్తిగా పక్కన పడేయడమే.నార్వే దౌత్యవేత్త ఎరిక్ సోల్‌హీమ్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ తన భార్య ఇలా చెప్పినట్లు మహీంద్రా ఒక కోట్ ట్వీట్ చేశాడు.
ఎరిక్ తన ట్వీట్‌లో ఒక ఫొటో షేర్ చేశారు.ఆ ఫొటోలో ఆనంద్ అనే ఒక వ్యక్తి నిద్రలేమితో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు.
అయితే ఆ పేషెంట్‌కు ప్రిస్క్రిప్షన్‌గా మీ కంప్యూటర్, ఫోన్‌ను పక్కన పడేయండి అని రాశారు.
ఇదే అసలైన, సమర్థవంతమైన నివారణ అని పేర్కొన్నారు.ఎరిక్ సోల్‌హీమ్ ట్వీట్‌కి ఆనంద్ మహీంద్రా బదులిచ్చారు, "ఎరిక్, మీరు నాకు దీన్ని ట్వీట్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.
నా భార్య ఇది నాకు కొన్ని సంవత్సరాల క్రితమే సూచించింది.ఆమెకు మెడికల్ డిగ్రీ కూడా లేదు.
" అని ఫన్నీగా కామెంట్ చేశారు.ఈ ట్వీట్ వైరల్‌గా మారింది, 7 వేల వరకు లైక్‌లు వచ్చాయి.
"""/"/
అయితే ఈ ట్వీట్ స్పందిస్తూ.'సార్, మీ భార్య మాట విని ఫోన్లు, కంప్యూటర్లు వాడటం మానేయకండి.
లేదంటే మిమ్మల్ని మేం చాలా మిస్ అవుతాం' అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.
దానికి రిప్లై ఇస్తూ తన వైఫ్ ఇలాంటి అడ్వైస్ ఇస్తే ఈ మెసేజ్ ఆమెకు చూపిస్తానని సరదాగా మహీంద్రా పేర్కొన్నారు.
అయితే ఫోన్లకు దూరంగా ఉండటం వల్ల చాలా వరకు నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
"నేను ఈ సలహాను అనుసరించాను, 10/10 ఇది పని చేస్తుంది!" అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.
"నా భార్య కూడా నాకు రోజు ఇదే చెప్తుంది, సర్" అని మరొక యూజర్ కామెంట్ చేశారు.
ఈ న్యాచురల్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ గ్లో..!