షాజహాన్ ను ఆ వరం అడిగిన అషురెడ్డి.. ఏకంగా నీ లాంటోడు కావాలంటూ?
TeluguStop.com
సోషల్ మీడియాతో స్టార్ గా గుర్తింపు పొంది ఇండస్ట్రీలో బాగా దూసుకుపోతున్న స్టార్ అషు రెడ్డి.
ఇక ఈ ముద్దుగుమ్మ గురించి సోషల్ మీడియా ప్రియులకు, బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం.
బుల్లితెర ఆర్టిస్ట్ గా ఓ వెలుగు వెలుగుంది అషు.అతి తక్కువ సమయంలో మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.
పైగా రెండుసార్లు బిగ్ బాస్ షో లో అవకాశం అందుకొని హౌస్ లో బాగా రచ్చ చేసి మరింత దృష్టి పెంచుకుంది.
ఇక తన హాట్ అందాలతో మాత్రం కుర్రాళ్ళను తన వైపు మలుపుకుంది.ఇక ఈ బ్యూటీ ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడుపుతుంది.
అషు డబ్స్మాష్ వీడియోలతో తొలిసారిగా అందరి దృష్టిలో పడింది.చూడటానికి సమంతలా కనిపించటంతో ఆ గుర్తింపుతోనే ఇప్పుడు ఇక్కడికి చేరుకుంది.
"""/" /
పైగా జూనియర్ సమంత అని పేరు సంపాదించుకుంది.ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండానే వెండితెరపై కూడా అవకాశం అందుకుంది.
కానీ ఒక సినిమాతోనే అవకాశం అందుకొని ఆ తర్వాత వెండితెరకు గుడ్ బై చెప్పేసింది.
నిజానికి తనకు వెండితెరపై ఎటువంటి అవకాశాలు రావట్లేదు అని చెప్పవచ్చు.ఇక బిగ్ బాస్ షో తర్వాత అషు రెడ్డి కెరీర్ పీక్స్ లోకి వెళ్ళింది.
విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.పవర్ స్టార్ అభిమాని కావడంతో పవన్ అభిమానుల నుండి మరింత సపోర్టు సంపాదించుకుంది.
గతంలో రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో తెగ పుకార్లు కూడా వచ్చాయి.ఆ తర్వాత బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.
కానీ అక్కడ కూడా ఎక్కువ కాలం లేకపోయింది. """/" /
ఆ తర్వాత యాంకర్ రవి తో కలిసి ఓ షోలో యాంకర్ గా కూడా చేసి బాగా రెచ్చిపోయింది.
అంతలోనే ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అవకాశం అందుకుంది.
ఇక ఇందులో కూడా అషు మరింత క్రేజ్ సంపాదించుకుంది.బిగ్ బాస్ తర్వాత మళ్లీ నెట్టింట్లో తన రచ్చ మొదలు పెట్టింది.
ప్రతి రోజు ఫోటోలు షేర్ చేసుకుంటూ తెగ లైకులు సంపాదించుకుంటుంది.వెండితెరపై అవకాశాలు అందుకోవటం కోసం బాగా ప్రయత్నిస్తుంది.
ఇక అప్పుడప్పుడు ఈమె చేసే పోస్టులను చూసి నెటిజన్లు దారుణమైన ట్రోల్స్, కామెంట్లు పెడుతూ ఉంటారు.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.
ఇక తను ఆగ్రా కి వెళ్ళగా అక్కడ దిగిన తాజ్ మహల్ దగ్గర దిగిన ఫొటోస్ ను పంచుకుంది.
"""/" /
ఆ ఫోటోలు బాగా వైరల్ అవ్వగా.ఆ ఫోటోలకు తను ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది.
హే షాజహాన్.మీలాగా ప్రేమించే నాకు దక్కాలి అంటూ దీవించండి అని కోరింది.
దీంతో వెంటనే ఓ నెటిజన్.షాజహానా.
వాడే ఒక పోరంబోకు.ముంతాజ్ కు 14వ డెలివరీ సమయంలో చనిపోతే.
ఆమె చెల్లిని పెళ్లి చేసుకున్నాడు.వాడి దీవెనలు నీకు కావాలి.
మల్ల అది ఈ సమాధి ముందు అంటే ఇప్పుడు నువ్వు పోయాక నీ చెల్లిని పెళ్లి చేసుకునేవాడు కావాలా నీకు అంటూ కౌంటర్ వేశారు.
చిరంజీవిని అనిల్ అలా చూపించనున్నారా.. ఆ సినిమాను మించిన హిట్ గ్యారంటీ!